
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3 ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్ రివీల్ అయ్యింది. డిసెంబర్ నెలలోనే OnePlus Ace 3 డివైజ్ లాంచ్ ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. OnePlus Ace 3 డివైజ్ భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 12R పేరుతో లాంచ్ కానుంది. సరే, ఓసారి OnePlus Ace 3 యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
OnePlus Ace 3 లాంచ్ టైమ్‌లైన్
? https://t.co/ySATZ29wgw pic.twitter.com/rDZJo5yiOX
— Mochamad Farido Fanani (@faridofanani96) December 4, 2023
- సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై OnePlus Ace 3 డివైజ్ కి సంబంధించిన లాంచ్ టైమ్ లైన్ వివరాలు షేర్ అయ్యాయి.
- పోస్ట్ ని గమనిస్తే, డివైజ్ డిసెంబర్ 17 న చైనాలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
- తొలుత చైనాలో లాంచ్ అయ్యాక, భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి OnePlus Ace 3 ఎంట్రీ ఇవ్వనుంది.
- భారత్ తో పాటు గ్లోబల్ గా జనవరి 23 వ తేదీన OnePlus 12R పేరుతో OnePlus Ace 3 లాంచ్ కానుందని సమాచారం.
- గతంలో వచ్చిన OnePlus Ace 2 మరియు OnePlus 11R 5G ఫోన్లను వన్‌ప్లస్ సంస్థ ఒకేసారి చైనాలో మరియు భారత్ లో లాంచ్ చేసింది.
- త్వరలో OnePlus Ace 3/OnePlus 12R లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.7-ఇంచ్ బీఓఈ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండవచ్చు.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఐఎంఎక్స్709 2x టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OnePlus Ace 3 లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











