
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Samsung Galaxy A55 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కనిపించింది. ఇకపోతే, Samsung Galaxy A55 డివైజ్ ఎగ్జినోస్ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన లీక్ ద్వారా Samsung Galaxy A55 యొక్క 5కే రెండర్స్ రివీల్ అయ్యాయి. దీంతో Samsung Galaxy A55 హ్యాండ్సెట్ డిజైన్ తో పాటు కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ గురించి తెలిసింది.
Samsung Galaxy A55 5K రెండర్స్
- MySmartPrice, OnLeaks.. Samsung Galaxy A55 యొక్క 5కే రెండర్స్ ని షేర్ చేశాయి. వాటిని గమనిస్తే, Samsung Galaxy A55 డివైజ్ ఫ్లాట్ డిస్ప్లే, సెంటర్-పంచ్ హోల్ కెమెరాతో వస్తున్నట్లు అర్థమవుతోంది.
- Samsung Galaxy A55 లో బ్యాక్ ప్యానెల్ పై ఎడమవైపున ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ నిలువుగా కనిపిస్తోంది.
- Samsung Galaxy A55 డివైజ్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. టాప్ లో సిమ్ ట్రే ఉంది. బాటమ్ లో యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ ఉన్నాయి.
- Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని రిపోర్ట్ ద్వారా తెలిసింది.
Samsung Galaxy A55 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎమ్డి జీపీయూ ఉంటాయని అంచనా.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.
- కెమెరా: Samsung Galaxy A55 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A55 డివైజ్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.
Samsung Galaxy A55 లాంచ్ వివరాలు
Samsung Galaxy A55 స్మార్ట్ఫోన్ లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో లాంచైన Samsung Galaxy A54 డివైజ్ కి సక్సెసర్ గా Samsung Galaxy A55 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది.











