స్విస్ రిటైలర్ ద్వారా లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25
  • ఎగ్జినోస్ 1280 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 3 కలర్ ఆప్షన్స్ లో రానున్న Galaxy A25

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 డివైజ్ ని లాంచ్ చేయనుంది. సపోర్ట్ పేజీ మరియు మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A25 కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ కి చెందిన రిటైలర్ వెబ్ సైట్ ద్వారా మరోసారి Samsung Galaxy A25 వివరాలు లీక్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు ఈ లీక్ ద్వారా బయటకు వచ్చాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 స్టోర్ లిస్టింగ్: ధర, లభ్యత

  • Samsung Galaxy A25 లిస్టింగ్ Digitec పై కనిపించింది. తొలుత దీన్ని GSMArena గుర్తించింది. ఇక లిస్టింగ్ ని గమనిస్తే, డివైజ్ బ్లాక్, బ్లూ, యెల్లీ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది.
  • లిస్టింగ్ లో Samsung Galaxy A25 ధర 279 స్విస్ ఫ్రాంక్ (CHF) గా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.26,315 అని చెప్పవచ్చు.
  • డిసెంబర్ 19 వ తేదీన Samsung Galaxy A25 డివైజ్ లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A25 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleSnapdragon 8 Gen 3 చిప్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Realme GT 5 Pro
Next articleDimensity 6100+ చిప్సెట్‌తో చైనాలో లాంచైన Redmi 13R 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.