
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Honor త్వరలో Honor Magic 6 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Honor Magic 6 Pro డివైజ్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. TheTechOutlook వెబ్సైట్ ఈ విషయాన్ని తన కథనంలో వెల్లడించింది. ఇక లిస్టింగ్ ద్వారా Honor Magic 6 Pro కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Honor Magic 6 Pro డివైజ్ యొక్క 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Honor Magic 6 Pro 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్
Honor Magic 6 Pro స్మార్ట్ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ లిస్టింగ్ పై BVL-AN16 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 5జీ నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే శాటిలైట్ మొబైల్ టెర్మినల్ 5జీ అని లిస్టింగ్ లో పేర్కొనబడి ఉంది.
అంటే Honor Magic 6 Pro లో శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా స్పష్టమవుతోంది. అలాగే ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. స్టాండర్డ్ మోడల్ Honor Magic 6 ఇదివరకే 3సీ సర్టిఫికేషన్ పై 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.
ఇకపోతే, Honor Magic 6 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, మ్యాజిక్ఓఎస్ 8 పై పని చేస్తుందని తెలుస్తోంది. అలాగే అడ్వాన్స్డ్ కెమెరా సెన్సర్స్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం.












