రివీలైన POCO C65 ఇండియా లాంచ్ తేదీ; ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్!

Highlights

  • భారత్‌లో లాంచ్ అవుతోన్న POCO C65
  • లాంచ్ తేదీ ప్రకటించిన POCO సంస్థ
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా POCO C65 సేల్

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO C65 డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. X ద్వారా పోకో కంపెనీ POCO C65 కి సంబంధించిన లాంచ్ తేదీని వెల్లడించింది. డిసెంబర్ 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు POCO C65 డివైజ్ భారత్ లో లాంచ్ కానున్నట్లు తన పోస్ట్ ద్వారా కంపెనీ తెలియజేసింది. Redmi 13C 4G కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C65 వస్తున్నట్లు సమాచారం. రెడ్మీ బ్రాండ్ రీసెంట్ గా భారత్ లో Redmi 13C 4G, 5G వేరియంట్స్ ని లాంచ్ చేసింది.

POCO C65 భారత్ లాంచ్ తేదీ

  • POCO ఇండియా చీఫ్ హిమాన్శు టాండన్ షేర్ చేసిన పోస్ట్ లో POCO C65 డివైజ్ డిసెంబర్ 15 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఫోన్ డిజైన్ కి సంబంధించిన టీజర్స్ ని కూడా హిమాన్శు షేర్ చేశారు.
  • POCO C65 డివైజ్ పర్పుల్ కలర్ ఆప్షన్ లో రానున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. గ్లోబల్ గా లాంచైన POCO C65 డిజైన్ మాదిరి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఫోన్ కనిపిస్తోంది. ఈ ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ పీచర్స్ తో వస్తోంది.

POCO C65 డిజైన్

  • POCO C65 బ్యాక్ ప్యానెల్ పై రెండు కెమెరా రింగ్స్ ఉన్నాయి. పోకో బ్రాండింగ్ తో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • సిమ్ కార్డ్ ట్రే ఫోన్ కి ఎడమవైపున ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • POCO C65 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్ లో సేల్ కి వస్తుందని హిమాన్శు పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • గ్లోబల్ మార్కెట్స్ లో POCO C65 డివైజ్ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చిన ఈ డివైజ్ ధర 129 డాలర్లు (సుమారు రూ.10,800) గా ఉంది.
  • ఇప్పటికే POCO C65 డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన కారణంగా పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

POCO C65 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ (1,600*720 పిక్సెల్స్) స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.6:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: POCO C65 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: POCO C65 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: POCO C65 డివైజ్ 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.09 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.
Previous article3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Honor Magic 6 Pro
Next articleచైనాలో లాంచైన Realme V50, V50s; స్పెసిఫికేషన్స్, ధర తెలుసుకోండి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.