హైలైట్స్:
* టెక్నో కేమాన్ 19 నియో, టెక్నో కేమాన్ 19 ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి.
* టెక్నో కేమాన్ 19 నియో, కేమాన్ 19 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ కలిగి ఉన్నాయి.
* టెక్నో కేమాన్ 19 సిరీస్ ధర రూ.12,499 నుంచి ప్రారంభం.

కేమాన్ 19 నియో, కేమాన్ 19 ఫోన్లలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లున్నాయి. ఇక కేమాన్ 19 నియో లో 16ఎంపి ఫ్రంట్ కెమెరాను ఇవ్వగా, కేమాన్ 19 లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
భారత్ లో టెక్నో Tecno Camon 19 Neo, Camon 19 ధర, సేల్ వివరాలు
టెక్నో కేమాన్ 19 నియో 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.12,999. ఇది డ్రీమ్ ల్యాండ్ గ్రీన్, ఐస్ మిర్రర్, ఎకో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ జులై 23 నుంచి ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఇక మరో మోడల్ కేమాన్ 19 ధర రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్ ఎకో బ్లాక్, సీ సాల్ట్ వైట్, జియో మెట్రిక్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఈ ఫోన్ అమ్మకాలు రిటైల్ ఔట్ లెట్స్ ద్వారా జరగనున్నాయి.
Tecno Camon 19 Neo స్పెసిఫికేషన్స్
టెక్నో కేమాన్ 19 నియో ఫోన్లో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, స్లిమ్ బెజెల్స్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, ఏఆర్ఎం మాలి-జీ52 2ఈఈఎంసీ2 జీపీయూ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఈ ఫోన్ 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఇక సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అలాగే 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే, కేమాన్ 19 నియో లో వెనుకాల ట్రిపుల్ కెమెరాస్ ఉన్నాయి. వీటిలో ఒకటి 48ఎంపి మెయిన్ సెన్సర్ కాగా, రెండోది 2ఎంపి డెప్త్, మూడోది 2ఎంపి ఏఐ సెన్సర్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగాన 32ఎంపి కెమెరాను అందించారు.
Tecno Camon 19 స్పెసిఫికేషన్స్
టెక్నో కేమాన్ 19 లో కూడా 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, సెంటర్ పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలీ-జీ68 ఎంసీ4 జీపీయూ, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ కస్టమ్ స్కిన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.
4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.













