Vivo X100, X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • Vivo X100 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీ ప్రకటన
  • డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న Vivo X100 సిరీస్
  • జాప్యం కానున్న Vivo X100 Pro+ చైనా లాంచ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. టాప్ మోడల్ Vivo X100 Pro+ చైనా లాంచ్ జాప్యం కానుంది. ఇక తాజాగా Vivo X100 సిరీస్ లాంచ్ తేదీని వివో ఖరారు చేసింది. ఈ సిరీస్ గ్లోబల్ గా డిసెంబర్ 14 వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. లాంచ్ ఈవెంట్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే Vivo X100, Vivo X100 Pro ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి.

Vivo X100 Pro+ చైనా లాంచ్ ఆలస్యం

Vivo X100 Pro+ స్మార్ట్‌ఫోన్ 2024 ప్రథమార్థంలో లాంచ్ అవుతుందని వివో సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ గతంలో Vivo X100 Pro+ ఏప్రిల్ లో లాంచ్ అవుతుందని అంచనా వేసింది. అయితే కొన్ని కారణాల వల్లన వివో లాంచ్ తేదీని మార్చిందని సమాచారం. త్వరలోనే Vivo X100 Pro+ కి సంబంధించిన మరింత సమాచారం బయటకు రానుంది.

Vivo X100, Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
  • బ్యాటరీ: Vivo X100 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Vivo X100 Pro లో 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.