
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. జనవరి 17 వ తేదీన జరిగే Unpacked Galaxy ఈవెంట్ లో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అవుతుంది. ఈ అన్ప్యాక్డ్ గెలాక్సీ ఈవెంట్ క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జరగనున్నట్లు కంపెనీ ఖరారు చేసింది. రీసెంట్ గా Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ (via) అయ్యాయి. ఇప్పుడు Samsung Galaxy S24 సిరీస్ ధరలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S24 సిరీస్ ధరలు
- Samsung Galaxy S24 స్టాండర్డ్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర USD 899 (సుమారు రూ.66,600) గా ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ Samsung Galaxy S24 8జిబి+256జిబి వేరియంట్ లో కూడా రానుంది.
- Samsung Galaxy S24+ బేస్ వేరియంట్ 8జిబి+256జిబి ధర USD 999 (రూ.83,250) ఉంటుందని అంచనా.
- Samsung Galaxy S24 Ultra 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర USD 1,199 (సుమారు రూ.83,250) గా ఉండే అవకాశం ఉంది.
- Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra డివైజెస్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా లాంచ్ కానున్నాయి.
Samsung Galaxy S24 సిరీస్ లో శాటిలైట్ కనెక్టివిటీ
Samsung Galaxy S24 సిరీస్ శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోందని కొన్ని వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా నెట్వర్క్ కవరేజీ లేని ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా మెసేజీలను పంపుకునే అవకాశం యూజర్లకు లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ని యాపిల్ సంస్థ, iPhone 14, iPhone 14 Pro, iPhone 15, iPhone 15 Pro సిరీసుల్లో పరిచయం చేసింది.
Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
- మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
- కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
- ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.











