50MP సెల్ఫీ కెమెరా, 108MP రియర్ కెమెరాతో లాంచైన Honor X8b

Highlights

  • సౌదీ అరేబియాలో లాంచైన Honor X8b
  • 6.7-ఇంచ్ FHD+ స్క్రీన్‌తో వచ్చిన డివైజ్
  • Honor X8b ధర 240 డాలర్లు (సుమారు రూ.19,900)

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor ఒక కొత్త ఫోన్ ని మిడిల్-ఈస్ట్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. Honor X8b పేరుతో వచ్చిన ఈ డివైజ్ సౌదీ అరేబియా లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Honor X8b స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor X8b ధర, కలర్ ఆప్షన్స్

  • Honor X8b స్మార్ట్‌ఫోన్ ధర సౌదీ అరేబియాలో 240 డాలర్లు (సుమారు రూ.19,900) గా ఉంది.
  • Honor X8b డివైజ్ మిడ్నైట్ బ్లాక్, టైటానియమ్ సిల్వర్, గ్లామరస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Honor X8b డివైజ్ యొక్క ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాలేదు. లాంచ్ అవుతుందో లేదో తెలియదు. భవిష్యత్తులో దీనిపై ఏదైనా ప్రకటన రావొచ్చు.

Honor X8b స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor X8b లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3240 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X8b లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ఉంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ఓఎస్: Honor X8b డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X8b డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor X8b లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Honor X8b లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.