లాంచ్‌కి ముందు లీకైన Honor Magic 6 స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor Magic 6
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న Honor Magic 6

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో Honor Magic 6 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈలోపు Honor Magic 6 డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. తమ అప్‌కమింగ్ Honor Magic 6 కోసం పోర్షే డిజైన్ తో పార్టర్ అయినట్లు హానర్ తెలిపింది. తాజాగా లీకైన Honor Magic 6 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor Magic 6 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Honor Magic 6 కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉంటాయని చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • ప్రొటెక్షన్: Honor Magic 6 డివైజ్ ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్, జుర్హినో డిస్ప్లే తో వస్తోంది.
  • ఓఎస్: Honor Magic 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: Honor Magic 6 లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ కింగ్‌హై లేక్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

Honor Magic 6 సెక్యూరిటీ చిప్ తో రానున్నట్లు సమాచారం. రేడియో ఫ్రీక్వెన్సీ, శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఇది ఉపయోగపడనుంది. ఐఫోన్స్ తో పాటు OPPO Find X7 Ultra, Samsung Galaxy S24 Ultra ఫోన్లలో ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ కనిపిస్తుంది.

Honor Magic 6 డివైజ్ ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

లీకైన Honor Magic 6 రెండర్ ని గమనిస్తే, సర్కులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ వేరియబుల్ అపర్చర్ సపోర్ట్ గల 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఈ ఫోన్ లో ఉండవచ్చు.

మరోవైపు Honor Magic 6 Pro 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ 1/1.3-ఇంచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 160ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయని సమాచారం. Honor Magic 6 Pro 2కే ఓఎల్ఈడీ డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

Honor Magic 6 సిరీస్ 2024 ఫిబ్రవరిలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

Previous articleడిసెంబర్ 22న భారత్‌లో లాంచ్ కానున్న POCO M6 5G
Next article1900mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Itel it5330 ఫీచర్ ఫోన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.