1900mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Itel it5330 ఫీచర్ ఫోన్

Highlights

  • భారత్ లో లాంచైన Itel it5330
  • గ్లాస్ ఫినిష్ డిజైన్‌తో వచ్చిన డివైజ్
  • Itel it5330 ధర రూ.1,499

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లను లాంచ్ చేస్తూ భారతీయ మార్కెట్ లో Itel సంస్థ తనకంటూ ఓ పేరుని సంపాదించుకుంది. తాజాగా ఈ సంస్థ భారత్ లో Itel it5330 అనే ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. దీని ధర రూ.1500 లోపే ఉండటం విశేషం. అంతేకాదు, ఈ ఫోన్ గ్లాస్ ఫినిష్ బాడీ డిజైన్, 2.8-ఇంచ్ డిస్ప్లే, 1900ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి Itel it5330 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Itel it5330 ధర, లభ్యత

  • Itel it5330 ఫీచర్ ఫోన్ రూ.1,499 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది.
  • Itel it5330 డివైజ్ బ్లూ, లైట్ గ్రీన్, లైట్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Itel it5330 ఫోన్‌ని కంపెనీ వెబ్‌సైట్ తో పాటు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Itel it5330 స్పెసిఫికేషన్స్

  • Itel it5330 లో గ్లాస్ ఫినిష్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫోన్ 11.11మి.మీ అల్ట్రా స్లిమ్ బాడీతో వచ్చింది.
  • Itel it5330 ఫీచర్ ఫోన్ లో 2.8-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే ఉంది.
  • Itel it5330 లో పవర్ బ్యాకప్ కోసం 1900 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 12 రోజుల బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
  • Itel it5330 డివైజ్ ఎన్నో భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, తమిళం, పంజాబి, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ భాషలు ఉన్నాయి.
  • Itel it5330 లో వినోదం కోసం వైర్లెస్ ఎఫ్ఎమ్ ఫెసిలిటీ అందించారు.
  • Itel it5330 డివైజ్ లో ఆటో కాల్ రికార్డింగ్, కింగ్ వాయిస్ ఫీచర్ అందించారు.
  • Itel it5330 లో డ్యూయల్ సిమ్ స్లాట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
  • Itel it5330 లో మెమొరీని 32జిబి వరకు పెంచుకోవచ్చు.
  • Itel it5330 డివైజ్ 2జీ సపోర్ట్ ని మాత్రమే కలిగి ఉంది. అంటే మీరు ఈ ఫోన్ లో జియో 4జీ సిమ్ లేదా తదితర 4జీ సిమ్స్ ఉపయోగించలేరు.
Previous articleలాంచ్‌కి ముందు లీకైన Honor Magic 6 స్పెసిఫికేషన్స్
Next article108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme C67 4G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.