
Realme C67 4G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. Realme C67 4G ప్రారంభ ధరను IDR 25,99,000 గా నిర్ణయించారు. ఈ డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Realme C67 4G డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme C67 4G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme C67 4G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme C67 4G లో స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.
- ఓఎస్: Realme C67 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme C67 4G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. అలాగే మెమొరీ కార్డ్ ద్వారా 2టిబి వరకు మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది.
- కెమెరా: Realme C67 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme C67 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme C67 4G ధర
- Realme C67 4G డివైజ్ ఇండోనేషియాలో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 25,99,000 (సుమారు రూ.13,999) గా ఉంది.
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను IDR 29,99,000 (సుమారు రూ.15,999) గా నిర్ణయించారు.
- Realme C67 4G స్మార్ట్‌ఫోన్ సన్నీ ఒయాసిస్ మరియు బ్లాక్ రాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











