లాంచ్‌కి ముందు లీకైన OPPO A59 5G ధర, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A59 5G
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వస్తోన్న OPPO A59 5G
  • OPPO A59 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఏ-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయనుంది. OPPO A59 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. అయితే లాంచ్ కి ముందు OPPO A59 5G ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. మరోవైపు OPPO A59 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ ద్వారా డివైజ్ డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి OPPO A59 5G ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A59 5G ధర (లీక్)

  • OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర రూ.14,999 గా ఉంటుందని.. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంటుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ X ఖాతా ద్వారా తెలిపారు.
  • OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ స్టారీ బ్లాక్ మరియు సిల్క్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • టిప్‌స్టర్ OPPO A59 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని కూడా షేర్ చేశారు. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A59 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO A59 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO A59 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous article8GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Lava Storm 5G
Next article24GB ర్యామ్, 50MP Sony IMX906 కెమెరాతో చైనాలో లాంచైన Honor 90 GT
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.