
ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో ఒక చవకైన మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసింది. Lava Storm 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి. Lava Storm 5G వర్చువల్ ర్యామ్ ద్వారా 16జిబి వరకు ర్యామ్ పవర్ ని అందిస్తుంది. ఇంకా 50ఎంపి మెయిన్ కెమెరా, భారీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Lava Storm 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్న్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Lava Storm 5G ధర
- Lava Storm 5G సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో భారత్ లో లాంచ్ అయ్యింది.
- Lava Storm 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంది.
- అమెజాన్ స్పెషల్ ధర గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ని లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.13,499 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- బ్యాంక్ ఆఫర్ల ద్వారా Lava Storm 5G పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
- అన్ని ఆఫర్లు కలుపుకుని Lava Storm 5G డివైజ్ ని యూజర్లు రూ.11,999 కి సొంతం చేసుకోవచ్చు.
- డిసెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి Lava Storm 5G సేల్ మొదలవుతుంది.
- Lava Storm 5G స్మార్ట్‌ఫోన్ గేట్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Lava Storm 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Lava Storm 5G లో 6.78-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Lava Storm 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ వాడారు. ఈ చిప్ అంటుటు స్కోర్ 4,20,000 గా ఉంది. సెగ్మెంట్ పరంగా ఇది మంచి స్కోర్ అని చెప్పవచ్చు.
- ర్యామ్, స్టోరేజీ: Lava Storm 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి ఎక్‌పాండబుల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Lava Storm 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Lava Storm 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Lava Storm 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Lava Storm 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Lava Storm 5G లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, ఫ్రీ హోమ్ సర్వీస్ సౌకర్యం ఉన్నాయి.











