
తక్కువ ధరలో అధిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే Tecno సంస్థ నూతన సంవత్సరంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 20 Pro+ పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ చక్కటి ఫీచర్లను కలిగి ఉంది. Tecno Spark 20 Pro+ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno Spark 20 Pro+ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 Pro+ ధర
- Tecno Spark 20 Pro+ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఈ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
- ఈ మోడల్ ధర భారత్ లో రూ.20,000 వద్ద ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
- కంపెనీ త్వరలోనే Tecno Spark 20 Pro+ ధరను ప్రకటించనుంది.
Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Spark 20 Pro+ లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డబుల్ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20 Pro+ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. దీని గరిష్ట క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్. మెరుగైన మొబైల్ గేమింగ్ కోసం ఈ ఫోన్ లో డార్విన్ ఇంజిన్ 2.0 టెక్నాలజీని వినియోగించారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro+ డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Tecno Spark 20 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, రెండు ఇతర సెన్సర్స్ ఉంటాయి. వాటి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Tecno Spark 20 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Tecno Spark 20 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











