
లో-బడ్జెట్ ఫోన్లతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించిన Tecno సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Tecno POP 8 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం రూ.5,999 ధరతో లాంచ్ అయ్యింది. చాలా తక్కువ ధరలో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ ఫోన్ సరైన ఎంపిక అవ్వవచ్చు. ఇకపోతే, Tecno POP 8 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Tecno POP 8 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Tecno POP 8 ధర, కలర్ ఆప్షన్స్
- Tecno POP 8 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
- Tecno POP 8 ధరను రూ.6,499 గా నిర్ణయించారు. జనవరి 9 వ తేదీ నుంచి డివైజ్ సేల్ మొదలుకానుంది.
- బ్యాంక్ ఆఫర్ లో భాగంగా Tecno POP 8 పై కంపెనీ రూ.5,00 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫోన్ ధర రూ.5,999 కి తగ్గనుంది.
- Tecno POP 8 స్మార్ట్ఫోన్ ని అమెజాన్ ఇండియా వెబ్సైట్ లేదా యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- Tecno POP 8 డివైజ్ మిస్టరీ వైట్, ఆల్పెన్గ్లో గోల్డ్, మ్యాజిక్ స్కిన్ మరియు గ్రావిటీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Tecno POP 8 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno POP 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno POP 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. దీని గరిష్ట క్లాక్ స్పీడ్ 1.6 గిగాహెర్ట్జ్. ఈ చిప్సెట్ ని ప్రత్యేకించి తక్కువ బడ్జెట్ ఫోన్ల కోసం రూపొందించారు.
- ఓఎస్: Tecno POP 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది. గూగుల్ గో యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ర్యామ్ తక్కువగా వినియోగించబడుతుంది. అలాగే ఇంటర్నెట్ మరియు బ్యాటరీ ఖర్చు కూడా తక్కువే అవుతుంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno POP 8 డివైజ్ 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. యూజర్ కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Tecno POP 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ లో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు.
- బ్యాటరీ: Tecno POP 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Tecno POP 8 ఫీచర్లు
- Tecno POP 8 లో 1టిబి ఎస్డీ కార్డ్ ఇన్స్టాల్ చేసుకునే సౌకర్యం ఉంది.
- Tecno POP 8 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- Tecno POP 8 డివైజ్ లో 100 శాతం రీసైక్లబుల్ బ్యాక్ కవర్ ని వాడారు.
- Tecno POP 8 డివైజ్ కేవలం 8.75 మి.మీ మందం ఉంది.
- Tecno POP 8 లో డ్యూయల్ డీటీఎస్ స్పీకర్స్ ఉన్నాయి.
- Tecno POP 8 లో ఎఫ్ఎమ్ రేడియో, ఓటీజీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











