iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు
  • ఫిబ్రవరిలో లాంచ్ కానున్న డివైజ్
  • అధికారిక ప్రకటన చేసిన ఐకూ బ్రాండ్

Vivo సబ్-బ్రాండ్ iQOO తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారతీయ మార్కట్ లో లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఆ సంస్థ ఉంది. అయితే లాంచ్ తేదీ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. తాజాగా ఐకూ ఇండియా iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ని సోషల్ మీడియా వేదికల ద్వారా టీజ్ చేసింది. సరే, ఓసారి iQOO Neo 9 Pro లాంచ్ కి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ వివరాలు

  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్ లాంచ్‌ని ఐకూ ఇండియా తన X ఖాతా ద్వారా టీజ్ చేసింది.
  • iQOO Neo 9 Pro భారత్ లో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని కంపెనీ తన పోస్ట్ ద్వారా వెల్లడించింది.
  • iQOO Neo 9 Pro యొక్క కచ్చితమైన లాంచ్ తేదీన మాత్రం కంపెనీ తెలుపలేదు. రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.

iQOO Neo 9, Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.
Previous article5,000mAh బ్యాటరీ, రూ.6,299 ధరతో భారత్‌లో లాంచైన itel A70
Next articleSnapdragon 7s Gen 2 చిప్‌తో లాంచ్ కానున్న Realme 12 Pro+
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.