Snapdragon 8 Gen 2 చిప్, 100W చార్జింగ్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 3

Highlights

  • చైనాలో లాంచైన OnePlus Ace 3
  • 1.5కే ఎల్టీపీవో డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • OnePlus Ace 3 ప్రారంభ ధర 2,599 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనీస్ మార్కెట్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేసింది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Ace 3 ఫోన్ లో 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. OnePlus ACE 3 జనవరి 23న OnePlus 12R పేరుతో భారత్‌లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి OnePlus Ace 3 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 ధర (చైనా)

  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ.30,271) గా ఉంది.
  • OnePlus Ace 3 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ.34,930) గా ఉంది.
  • OnePlus Ace 3 16జిబి+1టిబి టాప్ వేరియంట్ ధరను 3,499 యువాన్లు (సుమారు రూ.40,753) గా నిర్ణయించారు.
  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.78-ఇంచ్ 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. అడ్రెనో గ్రాఫిక్స్ వినియోగించారు.
  • మెమొరీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి.
  • కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో 5జీ, వై-ఫై 7, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.