
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. ఇంకా ఈ ఫోన్ల లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తాజాగా Vivo V30 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo V30 టీడీఆర్ఏ లిస్టింగ్
- త్వరలో లాంచ్ కాబోయే Vivo V30 డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై V2318 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- మోడల్ నంబర్ తప్పితే, Vivo V30 కి సంబంధించి మరే ఇతర వివరాలు వెల్లడి కాలేదు.
- Vivo V30 డివైజ్ లో 5జీ, డబ్ల్యూఎల్ఏఎన్, ఎన్ఎఫ్సీ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Vivo V30 లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
- ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
- కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
- ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












