
Redmi Note 13 సిరీస్ కొన్ని రోజుల క్రితం భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు స్టైలిష్ లుక్స్ మరియు చక్కటి ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క సేల్ సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్ లో Redmi Note 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఓసారి ధర, సేల్, ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 5G సిరీస్ సేల్ వివరాలు
Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro Plus 5G డివైజెస్ జనవరి 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంఐ ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
Redmi Note 13 5G సిరీస్ ధరలు

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.
Redmi Note 13 Pro Plus స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Redmi Note 13 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.
- కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
- బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











