
ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Blaze Curve 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇటీవలె Lava Blaze Curve 5G యొక్క లాంచ్ ని కంపెనీ టీజ్ చేసింది. తాజాగా Lava Blaze Curve 5G డివైజ్ ధర శ్రేణి, లాంచ్ టైమ్‌లైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ Themobileindian వెబ్‌సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Lava Blaze Curve 5G లాంచ్ టైమ్‌లైన్ మరియు ధర
- రిపోర్ట్ ప్రకారం, Lava Blaze Curve 5G ఫిబ్రవరిలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
- Lava Blaze Curve 5G డివైజ్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం.
- ధర విషయానికి వస్తే, Lava Blaze Curve 5G ధర శ్రేణి రూ.15,000 వద్ద ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
- అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ గా Lava Blaze Curve 5G విక్రయానికి రానుంది.
Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Lava Blaze Curve 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Lava Blaze Curve 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 ఎంపీ4 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Curve 5G 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Lava Blaze Curve 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 50ఎంపి ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.











