
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G 5G (2024) పేరుతో మార్కెట్ లోకి ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Moto G 5G (2023) కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ తాజాగా గీక్బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Moto G 5G (2024) యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Moto G 5G (2024) గీక్బెంచ్ లిస్టింగ్

- Moto G 5G (2024) డివైజ్ యొక్క మోడల్ నంబర్ గీక్బెంచ్ ద్వారా రివీల్ కాలేదు.
- Moto G 5G (2024) సింగిల్ కోర్ టెస్ట్ లో 842 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1,692 పాయింట్లు స్కోర్ చేసింది.
- Fogo అనే కోడ్ నేమ్ గల మదర్బోర్డ్ లిస్టింగ్ పై కనిపించింది.
- గ్రాఫిక్స్ కోసం Moto G 5G (2024) లో అడ్రెనో 619 జీపీయూ వాడినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Moto G 5G (2024) డివైజ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- ఇంకా లిస్టింగ్ పై Moto G 5G (2024) ఫోన్ 4జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది.
- గీక్బెంచ్ పై Moto G 5G (2024) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.
Moto G 5G (2023) స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G 5G (2023) స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- చిప్సెట్: Moto G 5G (2023) లో ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: 4జిబి ర్యామ్, హ్యాండ్సెట్ 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Moto G 5G (2023) లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 8ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
- బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: డాల్బి అట్మాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ, 5జీ కనెక్టివిటీ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.











