
Fire-Boltt కంపెనీ భారతదేశపు మొట్టమొదటి రిస్ట్‌ఫోన్ Fire-Boltt Dream ని లాంచ్ చేసింది. ఈ రిస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ అందించే అన్ని ఫంక్షన్స్ ని ఆఫర్ చేస్తున్నందున కంపెనీ తమ స్మార్ట్‌వాచ్ ని రిస్ట్ ఫోన్ అని చెబుతోంది. Fire-Boltt Dream ద్వారా యూజర్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, ఓటీటీ కంటెంట్ చూడటం.. వంటి పనులను చేయవచ్చు. సరే, ఓసారి Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్/రిస్ట్‌ఫోన్ యొక్క ధర, లభ్యత వివరాలు తెలుసుకుందాం.
Fire-Boltt Dream ధర, లభ్యత
- Fire-Boltt Dream 12 కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
- Fire-Boltt Dream కలర్ ఆప్షన్స్: ఆక్వా సర్జ్, చెర్రీ హగ్, కోరల్ బ్రీజ్, ఫారెస్ట్ ఫ్రింజ్, ఫ్యూజన్ ఫ్లికర్ మరియు షాడో గ్లైడ్.
- లెదర్ స్ట్రాప్ వేరియంట్ వచ్చి కొకొవా కౌచర్ మరియు మిడ్నైట్ గ్రేస్ కలర్స్ లో లభిస్తుంది.
- మెటాలిక్ స్ట్రాప్ వేరియంట్‌ని ఐరిష్ గ్లామ్, మిడ్నైట్ స్టీల్ మరియు స్కై సిజ్‌ల్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
- Fire-Boltt Dream డెనిమ్, సిలికాన్, ఓషన్ బ్యాండ్ వేరియంట్స్ ధరను రూ.5,999 గా నిర్ణయించారు.
- Fire-Boltt Dream లెదర్ వేరియంట్ ధర రూ.6,299 గా ఉంది.
- Fire-Boltt Dream మెటాలిక్ వేరియంట్ ధర రూ.6,499 గా ఉంది.
- Fire-Boltt Dream రిస్ట్‌ఫోన్ విక్రయాలు భారత్ లో ఇప్పటికే మొదలయ్యాయి. ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Fire-Boltt Dream స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Fire-Boltt Dream లో 2.02-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 320*386 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- వాచ్‌ఫేస్‌లు: Fire-Boltt Dream లో క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉంటాయి.
- డిజైన్: Fire-Boltt Dream లో స్క్వేర్ డయల్ డిజైన్, రొటేటింగ్ క్రౌన్, ఫంక్షన్ బటన్ ఉన్నాయి.
- స్ట్రాప్స్: Fire-Boltt Dream డెనిమ్, సిలికాన్, ఓషన్ బ్యాండ్, లెదర్ మరియు మెటల్ స్ట్రాప్స్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
- ప్రాసెసర్: Fire-Boltt Dream లో క్వాడ్-కోర్ ఏఆర్ఎమ్ కార్టెక్స్-ఏ7ఎంపి సీపీయూ, మాలి-టీ820 ఎంపీ1 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Fire-Boltt Dream లో 2జిబి ర్యామ్, 16జిబి స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Fire-Boltt Dream ఆండ్రాయిడ్ 8.1 పై పని చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- కనెక్టివిటీ: Fire-Boltt Dream లో 4జీ ఎల్టీఈ (నానో సిమ్), బిల్ట్-ఇన్ మైక్ మరియు స్పీకర్ సాయంతో ఎల్టీఈ కాలింగ్, జీపీఎస్, బ్లూటూత్ మరియు వై-ఫై సపోర్ట్ ఉన్నాయి.
- యాక్టివిటీ: Fire-Boltt Dream లో 300+ స్పోర్ట్స్ మోడ్స్, వీఆర్ వర్కవుట్ సపోర్ట్ ఉన్నాయి.
- హెల్త్ అండ్ ఫిట్నెస్: Fire-Boltt Dream లో ఫైర్-బోల్ట్ హెల్త్ సూట్, హార్ట్ రేట్ ట్రాకర్, ఎస్పీఓ2 సెన్సర్, కెలొరీ మానిటర్, ఫిట్నెస్ యాప్స్ (ప్లే స్టోర్ నుంచి) ఉన్నాయి.
- డ్యూరబులిటీ: Fire-Boltt Dream వాచ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది.
- బ్యాటరీ: Fire-Boltt Dream లో పవర్ బ్యాకప్ కోసం 800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 36 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. అలాగే నిరవధికంగా వాడితే 4 గంటల వరకు బ్యాకప్ లభిస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Fire-Boltt Dream స్మార్ట్‌వాచ్/రిస్ట్‌ఫోన్ 49.5 మి.మీ పొడవు, 13.5 మి.మీ వెడల్పు, 13.5 మి.మీ మందం, 50 గ్రాముల బరువు ఉంటుంది.











