లాంచ్ కి ముందు లీకైన Oppo Reno 8 Pro ధర, డిజైన్

హైలైట్స్:

  • లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన ఒప్పో రెనో 8 ప్రో డిజైన్
  • ట్రిపుల్ మారిసిలికాన్-పవర్డ్ కెమెరాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, పంచ్ హోల్ కటౌట్ తో వస్తున్న రెనో 8 ప్రో
  • భారత్ లో ఒప్పో రెనో 8 ప్రో ధర రూ.52,999 (12జిబి+256జిబి) ఉంటుందని అంచనా

జులై 18ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు భారత్ లో లాంచ్ అవ్వనున్నాయి. అంటే కేవలం ఇంకొన్ని రోజులే ఉంది. రెనో 8 సిరీస్ లైనప్ లో ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉండనున్నాయి. చైనాలో వర్షన్ అయిన ఒప్పో రెనో 8 ప్రో+ కి రీబ్రాండెడ్ వర్షన్ రెనో 8 ప్రో. భారత వేరియంట్ కి చైనా వేరియంట్ కి మధ్య స్పెసిఫికేషన్స్ లో తేడాలుంటాయి. ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1300, డైమెన్సిటీ 8100-మ్యాక్స్ చిప్సెట్స్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్నట్లు ఒప్పో ఇదివరకే కన్ఫర్మ్ చేసింది.

ఇప్పుడు లాంచ్ కి ముందు, రెనో 8 ప్రో పిక్స్ ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యాయి. టిప్ స్టర్ సుదాన్షు అంబోరే ఈ పిక్స్ షేర్ చేశాడు. వీటిని బట్టి, ఫోన్ కలర్ ఆప్షన్స్, ధర గురించి వివరాలు తెలిశాయి.

OPPO Reno 8 Pro కలర్ ఆప్షన్స్

గ్లేజ్డ్ బ్లాక్, గ్లేజ్డ్ గ్రీన్ రంగుల్లో ఒప్పో రెనో 8 ప్రో లభ్యం కానుందని, బయటకు వచ్చిన పిక్స్ ద్వారా స్పష్టమవుతోంది.

OPPO Reno 8 Pro డిజైన్

ఒప్పో రెనో 8 ప్రో ప్రీమియమ్ డిజైన్ ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం సెంటర్-పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎడమ వైపున వాల్యూమ్ రాకర్స్, కుడివైపున పవర్ బటన్, ఫోన్ వెనుక వైపు కెమెరా మాడ్యూల్, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. పవర్డ్ బై మారిసిలికాన్ అని రాసి ఉండటం మనం గమనించవచ్చు.

భారత్ లో OPPO Reno 8 Pro ధర

భారత్ లో ఒప్పో రెనో 8 ప్రో 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.52,990 ఉంటుందని అంచనా వేస్తున్నారు. తొలిసారిగా భారత్ లో రెనో ఫోన్ ధర రూ.50,000 మార్క్ ని దాటింది. ఇక 12జిబి వేరియంట్ తో పాటు, 8జిబి+128జిబి, 8జిబి+256జిబి వేరియంట్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

కెమెరాల విషయానికి వస్తే, ఒప్పో రెనో 8ప్రో లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటిలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, సెల్ఫీల కోసం 32ఎంపి కెమెరా ఉంటాయి.

రెనో ప్రో లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లుంటాయి.

Previous articleMotorola Edge 30 Ultra: ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ తో తీసిన ఫస్ట్ పిక్ ఇదిగో..!!
Next articleత్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO 9T
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.