
Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix Note 40, Infinix Note 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
- Infinix Note 40 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6853 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Infinix Note 40 Pro డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6850 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లు 8జిబి వరకు ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి.
- చిప్సెట్ MT6789V/CD అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. అంటే ఇది మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ అయ్యుంటుందని భావించవచ్చు.
- రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో రానున్నాయి.
- గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై రెండర్స్ కూడా రివీల్ అయ్యాయి. దీంతో ఫోన్ల లుక్ రివీల్ అయ్యింది.
- రెండు ఫోన్లు కూడా పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ని కలిగి ఉన్నాయని రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
- రెండు డివైజెస్ లో కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.
Infinix Note 40 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ లో 1080*2436 పిక్సెల్స రెజుల్యూషన్ గల డిస్ప్లే, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Note 40, Infinix Note 40 Pro ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 8జిబి వరకు ర్యామ్, బేస్ మోడల్ 128జిబి స్టోరేజీతో రానున్నాయి.
- కెమెరా: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
- బ్యాటరీ: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, ఈ రెండు ఫోన్లు కూడా 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఇవి 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
- ఓఎస్: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.











