
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 అనే డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా Moto G24 యొక్క ధర, స్పెసిఫికేషన్స్, రెండర్స్ లీక్ అయ్యాయి. Appuals ద్వారా Moto G24 కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. Moto G24 ని ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. సరే, ఓసారి Moto G24 డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto G24 ధర
- Moto G24 స్మార్ట్ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
- Moto G24 డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 169 యూరోలు (సుమారు రూ.15,340) గా ఉంది.
- మార్కెట్ ని బట్టి Moto G24 యొక్క ధర నిర్ణయించబడుతుంది.
Moto G24 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G24 లో 6.56-ఇంచ్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్ (1612*720 పిక్సెల్స్), 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
- చిప్సెట్: Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. మాలి జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Moto G24 డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో వస్తోంది. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని అందించనున్నారు.
- కెమెరా: Moto G24 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Moto G24 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Moto G24 డివైజ్ 163 మి.మీ పొడవు, 75 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది.
- కనెక్టివిటీ: Moto G24 లో డ్యూయల్ సిమ్, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5, బ్లూటూత్ 5.0 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
- సెక్యూరిటీ: Moto G24 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
- కలర్ ఆప్షన్స్: Moto G24 డివైజ్ బ్లాక్, గ్రీన్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











