Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన డివైజ్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Oppo Reno 11F 5G
  • తాజాగా ఖరారైన Oppo Reno 11F 5G లాంచ్
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో Reno 11F 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలి రోజుల్లో Oppo Reno 11F 5G కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఒప్పో ఇండోనేషియా వెబ్‌సైట్ పై Oppo Reno 11F 5G లిస్ట్ అయ్యింది. దీంతో Oppo Reno 11F 5G లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి Oppo Reno 11F 5G లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్, డిజైన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Oppo Reno 11F 5G లాంచ్ ఖరారు

  • Oppo Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండోనేషియా వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా పోస్ట్స్ ప్రత్యక్ష్యమయ్యాయి.
  • ఓ సోషల్ మీడియా పోస్ట్ లో షేర్ కాబడిన పిక్స్ ప్రకారం, Oppo Reno 11F 5G డివైజ్ గ్రీన్, పింక్ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.
  • అయితే ఈ పోస్ట్స్ ద్వారా లాంచ్ తేదీ మాత్రం వెల్లడి కాలేదు. ఫిబ్రవరి 24న Oppo Reno 11F 5G డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Oppo Reno 11F 5G డిజైన్

  • Oppo Reno 11F 5G డిజైన్ గురించి మాట్లాడితే, ఫ్రంట్ పంచ్ హోల్ స్క్రీన్ ఉంది.
  • Oppo Reno 11F 5G బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • రెండు కలర్స్ లో Oppo Reno 11F 5G డివైజ్ కనిపిస్తోంది.
  • పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.

Oppo Reno 11F 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Oppo Reno 11F 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.
  • కెమెరా: Oppo Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కెమెరా మాడ్యూల్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Oppo Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Oppo Reno 11F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్ ఉంటాయి.