
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో రెండు చవకైన 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. Galaxy M15 5G, Galaxy F15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. శాంసంగ్ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ ప్రకటన బయటకు రావాల్సి ఉంది. ఈలోపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్ పై గెలాక్సీ ఎమ్ 15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లు లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M15 5G, Galaxy F15 5G బీఐఎస్ లిస్టింగ్
- శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ డివైజెస్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యాయి.
- శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ డివైజ్ SM-M156B అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది.
- శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ SM-E156B అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది.
- బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఈ రెండు స్మార్ట్ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లేదా ఫీచర్లు రివీల్ కాలేదు. కానీ, Galaxy M15 5G, Galaxy F15 5G భారత్ లో త్వరలోనే లాంచ్ కానున్నాయని ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
- ఓఎస్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ప్రాసెసర్: Samsung Galaxy M14 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.
- కెమెరా: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











