
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Asus తన జెన్‌ఫోన్ సిరీస్ ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో Asus Zenfone 11 ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేసేందుకు ఆసుస్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. తాజాగా Asus Zenfone 11 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Asus Zenfone 11 కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Asus Zenfone 11 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

- Asus Zenfone 11 డివైజ్ AI2401_D అనే మోడల్ నంబర్ తో గూగుల్ ప్లే కన్సోల్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది.
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా Asus Zenfone 11 పేరు కన్ఫర్మ్ అయ్యింది.
- లిస్టింగ్ తో పాటు Asus Zenfone 11 ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉందో తెలుస్తోంది.
Asus Zenfone 11 డిజైన్ (లిస్టింగ్)
- Asus Zenfone 11 స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ ని గమనిస్తే, ఫోన్ ముందువైపు సెంటర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది.
- Asus Zenfone 11 లో నాలుగు వైపులా సన్నని బెజెల్స్ ఉన్నాయి. పవర్ మరియు వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
- గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా ఇవే విషయాలు తెలిసాయి. బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఎలా ఉంటుందో తెలియలేదు.
Asus Zenfone 11 స్పెసిఫికేషన్స్ (లిస్టింగ్)
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం, Asus Zenfone 11 డివైజ్ క్వాల్కమ్ SM8650 ప్రాసెసర్ తో కనిపించింది. అంటే ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. Asus Zenfone 11 లో అడ్రెనో 830 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి.
- జీపీయూ వివరాలను బట్టి చూస్తే, Asus Zenfone 11 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని అర్థమవుతోంది.
- Asus Zenfone 11 లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- Asus Zenfone 11 డివైజ్ 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Asus Zenfone 11 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.
Asus Zenfone 11 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
Asus Zenfone 11 డివైజ్ లాంచ్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.











