కన్ఫర్మ్ అయిన Xiaomi MIX Fold 2 లాంచ్

హైలైట్స్:

  • ఆగస్టు 11 న చైనాలో లాంచ్ కానున్న షావోమీ మిక్స్ ఫోల్డ్ 2, ప్యాడ్ 5 ప్రో 12.4 టాబ్లెట్, బడ్స్ 4 ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్
  • షావోమీ తన తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12ఓఎస్ మిక్స్ ఫోల్డ్ 2 లో ప్రధాన ఫీచర్లు

ఆగస్టు 11 న చైనాలో షావోమీ ఒక ఈవెంట్ ను నిర్వహిస్తోంది. కంపెనీ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ సంవత్సరాది స్పీచ్ తో పాటు, కంపెనీ యొక్క లక్ష్యాలు వెల్లడించనున్నారు. అలాగే అతడు కొన్ని ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయనున్నాడు. షావోమీ మిక్స్ ఫోల్డ్ 2, షావోమీ ప్యాడ్ 5 ప్రో (12.4-ఇంచ్ ట్యాబ్లెట్), షావోమీ బడ్స్ 4 ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ లాంచ్ కానున్నట్లు నేడు షావోమీ ప్రకటించింది. ఇదే వేదికపై షావోమీ తన తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

గతేడాది వచ్చిన ఫోల్డ్ ఫోన్ కి సక్సెసర్ గా షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 మార్కెట్ లోకి వస్తోంది. టీజర్ ఇమేజ్ లో ఫోన్ బంగారు వర్ణంలో కనిపిస్తోంది. అలాగే షావోమీ యొక్క ప్రత్యేక హింజ్ మెకానిజమ్ ని మనం గమనించవచ్చు. ఫోల్డింగ్ స్క్రీన్ ఫోన్స్ లో ఫోల్డ్ 2 వినూత్నమైందని, పలు మార్పులు ఉంటాయని తెలిపింది.

Xiaomi MIX Fold 2 స్పెసిఫికేషన్స్

షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 లో 6.5 అంగుళాల శాంసంగ్ అమోలెడ్ ఈ5 కవర్ డిస్ప్లే, 21:9 యాస్పెక్ట్ రేషియో, 2520*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. 8-ఇంచ్ ఈసీఓ2 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే ఇందులో ఉండనున్నట్లు సమాచారం. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ని ఈ ఫోన్లో అమర్చినట్లు తెలుస్తోంది. టెనా లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ 12జిబి + 512జిబి మరియు 12జిబి + 1టీబీ వేరియంట్స్ లో లభిస్తుంది.

మిక్స్ ఫోల్డ్ 2 లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 13ఎంపి ఓమ్నీవిజన్ ఓవీ13బి అల్ట్రా-వైడ్ స్నాపర్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో కూడిన టెలీఫోటో కెమెరా, సర్జ్ సీ1 ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ ఉండనున్నాయి. టీజర్ ఇమేజ్ ని బట్టి, ఈ ఫోల్డబుల్ ఫోన్లో లైకా ఆప్టిక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 3సీ లిస్టింగ్ ని బట్టి ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

Xiaomi Pad 5 Pro స్పెసిఫికేషన్స్

గీక్ బెంచ్ పై 22081281ఏసీ అనే మోడల్ నంబర్ తో షావోమీ ప్యాడ్ 5 ప్రో దర్శనమిచ్చింది. 8జిబి ర్యామ్ తో పాటు ఇతర ర్యామ్ ఆప్షన్లు కూడా ఉండే అవకాశముంది. ఆండ్రాయిడ్ 12ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ టాబ్లెట్ కస్టమ్ స్కిన్ పై ఈ డివైజ్ పని చేస్తుంది. ఈ డివైజ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో రానుంది.

స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ని ఈ టాబ్లెట్ లో అమర్చినట్లు సమాచారం. టీజర్ ఇమేజ్ ని బట్టి షావోమీ ప్యాడ్ 5 ప్రో 12.4 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండనుంది. ఇది ఎల్సీడీ డిస్ప్లే అయ్యుండే అవకాశముంది. ఇక చివరగా, షావోమీ బ్రాండ్ నుంచి షావోమీ బడ్స్ 4 ప్రో ఏఎన్‌సీ సపోర్ట్ తో లాంచ్ అవుతోంది.