OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ఇండియా ధర

Highlights

  • ఏప్రిల్ 1న OnePlus Nord CE 4 లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్
  • 100W సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord CE 4 పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 1న భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 ధర (లీక్)

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ల ధరలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేశారు. ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. OnePlus Nord CE 4 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OnePlus Nord CE 4 లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord CE 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్ కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Nord CE 4 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 4 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 కలర్ గేముత్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

కలర్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.