
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ హడావుడి కొనసాగుతోంది. ఈ ఆఫర్ల జాతరను జనాలు బాగా ఆస్వాదిస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఎన్నో ఉత్పత్తులు డిస్కౌంట్స్ తో వారి ముందుకు వస్తున్నాయి. తక్కువ ధరలో చక్కటి ఉత్పత్తులను సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే వేటిని కొనాలో అనే దానిపై క్లారిటీ ఉండదు. అందుకే ఇక్కడ మీకోసం బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ వివరాలను అందిస్తున్నాం. అద్భుతమైన గేమింగ్ మెషీన్స్ మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. కట్టింగ్-ఎడ్జ్ ప్రాసెసర్స్, హై-రిఫ్రెష్ రేట్, ఎస్ఎస్‌డీ స్టోరేజీ కలిగిన ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా ల్యాప్ టాప్స్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ జాబితాను ఇక్కడ తెలుసుకుందాం.
ASUS TUF Gaming A15
గేమింగ్ ల్యాప్‌టాప్స్ గురించి ఆలోచిస్తే, అంత తక్కువకు ఏమీ లభించవు. కానీ, ASUS TUF Gaming A15 ల్యాప్ టాప్ సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ లో 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఎండీ రైజెన్ 5 4600H సీపీయూ, ఎన్వీడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650 జీపీయూ, 512జిబి ఎస్ఎస్డీ స్టోరేజీ, అడిషనల్ ఎమ్.2 స్లాట్ ఉన్నాయి. ఇంకా మీకు ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ కి ఒక నెల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
అసలు ధర: రూ.71,990
డీల్ ధర: రూ.48,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)
HP Omen 16
HP Omen 16 ల్యాప్ టాప్ 16.1-ఇంచ్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ మెషీన్ లో ఏఎండి రైజెన్ 7 6800H ప్రాసెసర్ ని వాడారు. ఈ ల్యాప్ టాప్ లో అద్భుతమైన డిస్ప్లే ఉంది. క్యూహెచ్డీ రెజుల్యూషన్ (2560*1440 పిక్సెల్స్), 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. HP Omen 16 మెషీన్ 16జిబి ర్యామ్ తో వచ్చింది. దీన్ని 32జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ 1టిబి ఎస్ఎస్‌డీ తో వచ్చింది. ఎన్డీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3070 టీఐ జీపీయూ గ్రాఫిక్స్ ని ల్యాప్ టాప్ లో అందించారు. 4-జోన్ బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఈ ల్యాప్ టాప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతీ జోన్ కూడా ఇండిపెండెంట్ ఆర్జీబీ స్పెక్ట్రమ్ ని కలిగి ఉంది.
అసలు ధర: రూ.1,26,641
డీల్ ధర: రూ.1,12,989 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)
Acer Aspire 5
ఏసర్ కంపెనీ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన ల్యాప్‌టాప్ మీకు కచ్చితంగా నచ్చవచ్చు. 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1240పి ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ వచ్చంది. ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 జీపీయూ గ్రాఫిక్స్ ని ఇందులో అందించారు. 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఈ ల్యాప్ టాప్ లో ఉంది. కళ్ళను బ్లూ లైట్ నుంచి కాపాడేందుకై ఇందులో డిస్ప్లే ప్యానెల్ ని ఏసర్ కామ్ఫీవ్యూ తో కోట్ చేశారు.
అసలు ధర: రూ.82,999
డీల్ ధర: రూ.57,489 (బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి)
HP Victus (15.6-inch)
బడ్జెట్ సెగ్మెంట్ గేమింగ్ ల్యాప్ టాప్ అయిన HP Victus మెషీన్ పూర్తిస్థాయి గేమింగ్ మెషీన్ కి ఏమాత్రం తీసిపోదు. తొలుత ఈ ల్యాప్ టాప్ డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏఎండీ రైజెన్ 5 5600హెచ్ ప్రాసెసర్, ఏఎండీ రేడియన్ ఆర్ఎక్స్ 6500ఎమ్ జీపీయూ ఇందులో ఉన్నాయి. 15.6-ఇంచ్ స్క్రీన్ పై అద్భుతమైన విజువల్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని ఈ ల్యాప్ టాప్ లో అందించారు. డ్యూయల్ స్పీకర్ సెటప్ బీ&వో ద్వారా ట్యూన్ చేయబడింది.
అసలు ధర: రూ.77,354
డీల్ ధర: రూ.52,989 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)
HP Victus (16.1-inch)
HP Victus (16.1-inch) ల్యాప్ టాప్ పై కూడా ఈ సేల్ సందర్భంగా ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ ల్యాప్ టాప్ లో 16.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్ డిజైన్ అలాగే ఉంటుంది. ఏఎండీ రైజెన్ 5 5600హెచ్ ప్రాసెసర్, ఏఎండీ రేడియన్ 5500ఎమ్ గ్రాఫిక్స్ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. 512జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఈ ల్యాప్ టాప్ లో అందించారు. పరిమిత కాల ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ తో ఈ ల్యాప్ టాప్ వస్తోంది.
అసలు ధర: రూ.71,343
డీల్ ధర: రూ.52,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)
Dell Gaming G15 5525
ఇదొక సరైన వర్క్+ప్లే మెషీన్ అని చెప్పవచ్చు. ఈ వేసవిలో మీరు దీనిని సొంతం చేసుకొని లాభం పొందండి. రోజువారీ పెర్ఫామెన్స్ ని ఇది ఉత్తమంగా అందిస్తుంది. ఏఎండీ రైజెన్ 5 6600హెచ్ సీపీయూ, 8జిబి ర్యామ్ (32జిబి వరకు పెంచుకోవచ్చు), 512జిబి ఎస్ఎస్డీ స్టోరేజీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 ప్రీ-ఇన్‌స్టాల్డ్ కాపీ, 15-మంత్ McAfee యాంటీ వైరస్ సబ్‌స్క్రిప్షన్ ఈ ల్యాప్ తో లభిస్తాయి. ఇది కచ్చితంగా ప్రొఫెషనల్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ గల ఈ ల్యాప్ టాప్ గేమింగ్ కూడా బాగా పని చేస్తుంది.
అసలు ధర: రూ.1,01,448
డీల్ ధర: రూ.62,989 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)
HP Victus (Ryzen 7)
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో HP Victus (Ryzen 7) ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మోడల్ ఏఎండీ రైజెన్ 7 5800హెచ్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఈ ల్యాప్ టాప్ లో 16.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ, 512జిబి ఎస్ఎస్డీ ఉన్నాయి. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 తో వస్తోంది. అలాగే ఒక నెల కాలపరిమితితో ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
అసలు ధర: రూ.92,395
డీల్ ధర: రూ.66,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)
ASUS TUF Gaming F15 (2021)
ASUS TUF Gaming F15 (2021) ల్యాప్ టాప్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటి. ఇది టెంత్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-10300హెచ్ చిప్ తో వచ్చింది. 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, ఎన్వీడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650 జీపీయూ, 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆర్జీబీ-బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఒక నెల్ ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ వంటివి ఈ ల్యాప్ టాప్ తో లభిస్తాయి.
అసలు ధర: రూ.74,990
డీల్ ధర: రూ.51,489 (బ్యాంక్ ఆఫర్ మరియు కూపన్ తో కలిపి)
ASUS TUF Gaming A15 (2022)
ASUS TUF Gaming A15 (2022) లో 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఎండీ రైజెన్ 7 6800హెచ్ ప్రాసెసర్, ఎన్వీడియా ఆర్టీఎక్స్ 3050 జీపీయూ, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ స్టాంగ్ బాడీతో వచ్చింది. అలాగే ఆకర్షణీయమైన లుక్స్ ఈ ల్యాప్ టాప్ సొంతం.
అసలు ధర: రూ.1,41,990
డీల్ ధర: రూ.80,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)
HP Victus (Intel Core i5)
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా HP Victus (Intel Core i5) ల్యాప్ టాప్ పై మంచి డీల్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-12450హెచ్ ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ల్యాప్ టాప్ లో 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ ద్వారా ఒక నెల పాటు ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
అసలు ధర: రూ.86,343
డీల్ ధర: రూ.68,989 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)