
ఇంకా ఆ సంప్రదాయ టీవీ లనే వాడకండి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో సరికొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేసి గొప్ప వీక్షణానుభూతిని పొందండి. 4కే రెజుల్యూషన్ తో కూడిన ఓఎల్ఈడీ టీవీలపై మంచి ఆఫర్లు మీ ఎదుటకు వచ్చాయి. ప్రీమియమ్ టీవీలతో పాటు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, చవకైన స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లను అందిస్తోంది. కాబట్టి, మీకు పెద్దగా ఖర్చు లేకుండానే కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది.
సోని, శాంసంగ్, వీయూ, ఎల్‌జీ మరియు మరెన్నో ఇతర బ్రాండ్స్ కి చెందిన టీవీలపై ప్రస్తుత సేల్ లో ఆఫర్లు లభిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మరియు కొటక్ బ్యాంక్ తో కలిసి అమెజాన్ సంస్థ అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ ద్వారా జరిపే లావాదేవీలకు వర్తిస్తుంది.
Sony Bravia 55 inches XR series 4K Ultra HD Smart OLED Google TV
55-ఇంచ్ సోని బ్రేవియా స్మార్ట్ టీవీ ప్రస్తుతం కొనసాగుతోన్న సేల్ లో ఆకర్షణీయమైన ధరకే లభిస్తోంది. ఈ సోని స్మార్ట్ టీవీ 4కే ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. ఈ టీవీ ఎక్స్‌ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ తో వచ్చింది. ఈ టీవీ డెడికేటెడ్ గేమ్ మోడ్ తో వచ్చింది. ఇది గేమర్స్ కి ఎంతో ఉపయోగపడుతుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ మరియు ఆటో లో-లేటెన్సీ మోడ్ గేమింగ్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్తుంది. అలాగే 30 వాట్స్ స్పీకర్స్ ఈ టీవీలో ఉన్నాయి. డాల్బీ అట్మాస్, ఎక్స్‌ఆర్ సౌండ్, వాయిస్ జూమ్ తదితర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. క్రోమ్‌కాస్ట్ ఈ టీవీలో ఉంటుంది.
అసలు ధర: రూ.1,19,900
డీల్ ధర: రూ.1,05,025 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
Samsung 43 inches Crystal 4K Series Ultra HD Smart LED TV
శాంసంగ్ 43 ఇంచ్ క్రిస్టల్ 4కే సిరీస్ స్మార్ట్ టీవీ స్లిమ్ డిజైన్ తో వచ్చింది. ఈ టీవీలో 4కే ప్యానెల్ ఉంది. హెచ్డీఆర్10+, ప్యూర్‌కలర్, మెగా కాంట్రాస్ట్ మరియు యూహెచ్డీ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ డాల్బి డిజిటల్ ప్లస్ 20 వాట్స్ స్పీకర్స్ ని కలిగి ఉంది. క్యూ సింఫనీ ఫీచర్ ఈ టీవీలో ఉంది. ఇది టీవీ స్పీకర్స్ మరియు ఎక్స్‌టర్నల్ సౌండ్‌బార్ లను రెండింటినీ వాడుకునే వీలు కల్పిస్తుంది. ఇందులో ట్యాప్ వ్యూ స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ ఫీచర్ మరియు పీసీ మోడ్ ఉంది. దీని ద్వారా పీసీ/ల్యాప్‌టాప్ ని మీ స్మార్ట్ టీవీ పై వాడుకోవచ్చు.
అసలు ధర: రూ.29,990
డీల్ ధర: రూ.26,115 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
Vu 55 inches The Masterpiece Glo Series 4K Ultra HD Smart Android QLED TV
55-ఇంచ్ వీయూ మాస్టర్‌పీస్ గ్లొ సిరీస్ 4కే టీవీని మీ గృహ వినోద అవసరాల కోసం ఎంచుకోవచ్చు. ఈ టీవీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. 4కే ప్యానెల్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. దీని వల్లన విజువల్స్ బ్రైట్ గా ఉంటాయి. లోకల్ డిమ్మింగ్ ఫీచర్ ఉంది. ఇది బ్లాక్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. సీమ్‌లెస్ వాయిస్ కంట్రోల్ కోసం బిల్ట్-ఇన్ ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఈ టీవీతో వస్తున్నాయి. ఈ టీవీలో ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంది. దర్శకుడి దృష్టికోణంలో సినిమాని చూసేందుకు ఈ మోడ్ ఉపయోగపడుతుంది. క్రికెట్, సినిమా మరియు ఏఐ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఈ టీవీలో ఉన్నాయి.
అసలు ధర: రూ.66,990
డీల్ ధర: రూ.55,490 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
TCL 40 inches Full HD Certified Android Smart LED TV
చవకైన స్మార్ట్ టీవీల విషయానికి వస్తే, 40-ఇంచ్ టీసీఎల్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఈ సేల్ లో ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. అంటే మీకు ఎన్నో యాప్స్ మరియు గేమ్స్ కి యాక్సెస్ లభించడంతో పాటు, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో తదితర ఓటీటీ యాప్స్ ని వినియోగించుకోవచ్చు. ఈ టీవీలో మైక్రో డిమ్మింగ్ ఫీచర్ ఉంది. ఈ టీవీలో ఉన్న 48-ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్యానెల్ వ్యూయర్స్ కి థియేటర్ వంటి అనుభూతిని ఇంటి వద్దే అందిస్తుంది.
అసలు ధర: రూ.21,795
డీల్ ధర: రూ.15,490 (బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి)
Sony Bravia 55 inches 4K Ultra HD Smart LED Google TV
ఇతర సోని బ్రేవియా స్మార్ట్ టీవీల మాదిరే ఈ 55-ఇంచ్ బ్రేవియా స్మార్ట్ టీవీ కూడా అద్భుతమైన ఆడియోవిజువల్ అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీ 4కే ఎక్స్1 ప్రాసెసర్ తో వచ్చింది. లో-ఎండ్ సౌండ్ ని బూస్ట్ చేసేందుకు ఓపెన్ బేఫ్‌ల్ స్పీకర్స్ అందించారు. క్లియర్ పేస్ టెక్నాలజీ వ్యూయర్స్ కి క్లియర్ మరియు నేచురల్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది.
అసలు ధర: రూ.55,990
డీల్ ప్రైస్: రూ.51,990 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్ కలిపి)
VW 32 inches Linux Series Frameless HD Ready Smart LED TV
వీడబ్ల్యూ 32-ఇంచ్ ఫ్రేమ్‌లెస్ టీవీ ఈ జాబితాలో అత్యంత చవకైనది. హెచ్డీ-రెడీ ప్యానెల్ ఐపీఈ టెక్నాలజీ, ఇకో విజన్, సినిమా మోడ్, సినిమా జూమ్ అనే ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. 20 వాట్స్ స్పీకర్స్ ని ఈ టీవీలో ఇచ్చారు. మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ని టీవీపై ప్రదర్శించేందుకు స్క్రీన్ కాస్ట్ సపోర్ట్ ఉంది. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5 తదితర యాప్స్ కి యాక్సెస్ ఉంది. ఈ టీవీ వై-పై మరియు ఈఏఈఆర్‌సీ పోర్ట్ తో సహా ఇతర ముఖ్యమైన పోర్ట్స్ ని కలిగి ఉంది.
అసలు ధర: రూ.7,499
డీల్ ధర: రూ.5,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
VU 55 inches The GloLED Series 4K Smart LED Google TV
వీయూ కంపెనీకి చెందిన ఈ 55-ఇంచ్ గ్లోఎల్ఈడీ సిరీస్ 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ 400 నిట్స్ బ్రైట్నెస్, 95 ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ తో వచ్చింది. ఈ టీవీ ప్యానెల్ డాల్బి విజన్, హెచ్డీఆర్10+, హెచ్ఎల్‌జీఐఏఐ పీక్యూ ఇంజిన్, డైనమిక్ బ్యాక్‌లైట్ కాంట్రో తదితర ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్ మరియు 104 వాట్ డీజే సౌండ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ టీవీలో వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్, ఎంఈఎంసీ వంటివి ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్ కూడా ఉంది. ఈఏఆర్‌సీ/ఏఆర్‌సీ పోర్ట్స్ ఉన్నాయి.
అసలు ధర: రూ.38,499
డీల్ ధర: రూ.32,490 (బ్యాంక్ డిస్కౌంట్స్ తో కలిపి)
Sony Bravia 65 inches 4K Ultra HD Smart LED Google TV
ఈ లిస్ట్ లో మరొక సోని బ్రేవియా 4కే టీవీ ఉంది. ఈ టీవీ 65-ఇంచ్ 4కే ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ టీవీలో ఎక్స్1 4కే ప్రాసెసర్, 4కే హెచ్డీఆర్, లైవ్ కలర్, 4కే ఎక్స్ రియాల్టీ ప్రో, మోషన్ ఫ్లో ఎక్స్ఆర్100 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. అలెక్సా వాయిస్ అసిస్టంట్ సపోర్ట్ ఉంది. 20 వాట్స్ ఓపెన్ బాఫెల్ స్పీకర్స్, డాల్బీ ఆడియో, క్లియర్ పేస్ టెక్నాలజీ ఈ టీవీలో ఉన్నాయి. ఈ టీవీ ప్లే స్టోర్ లో ఉన్న 7000 లకు పైగా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
అసలు ధర: రూ.70,990
డీల్ ధర: రూ.63,499 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్స్)
LG 48 inches 4K Ultra HD Smart OLED TV
ఎల్‌జీ కంపెనీ నుంచి వచ్చిన ఈ ప్రీమియమ్ 48-ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ వెబ్ఓఎస్ పై పని చేస్తుంది. ఈ టీవీలో ఏఐ 4కే అప్‌స్కేలర్ ఉంది. గూగుల్ అసిస్టంట్, అలెక్సా, ఆపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్‌కిట్ వంటి వాటికి ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో ఆల్ఫా7 జెన్5 ఏఐ ప్రాసెసర్ ఉంది. డైనమిక్ టోన్ మ్యాపింగ్ లో ఏఐ ప్రాసెసర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆడియో విషయానికి వస్తే, ఇదే ప్రాసెసర్ 2-చానల్ ఆడియో నుంచి వర్చువల్ 5.1.2 చానల్ సౌండ్ కి అప్‌స్కేల్ అవుతుంది. ఇది మెరుగైన సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ని అందిస్తుంది.
ఏఐ పిక్చర్ ప్రో, పిక్చర్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. ఈ టీవీలో డాల్బీ విజన్ ఐక్యూ మరియు డాల్బి అట్మాస్ ఉన్నాయి. ఇంకా ఈ టీవీ హెచ్‌జీఐజీ మరియు ఏఎల్ఎల్ఎమ్, ఈఏఆర్‌సీ సపోర్ట్ వంటి వాటిని అందిస్తుంది.
అసలు ధర: రూ.75,490
డీల్ ధర: రూ.69,240 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
Kodak 65 inches Matrix Series 4K Ultra HD Smart QLED Google TV
లిస్ట్ లో చివరిదైన 65-ఇంచ్ కొడాక్ మ్యాట్రిక్స్ సిరీస్ 4కే స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ, పేరులో పేర్కొన్నట్లుగా గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. ఈ టీవీ లో గూగుల్ అసిస్టంట్ బిల్ట్-ఇన్ గా ఇవ్వబడింది. డాల్బి విజన్, అట్మాస్ కాంబినేషన్ అనేది అల్టిమేట్ థియేటర్ వంటి మూవీ-వాచింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో క్యూఎల్ఈడీ ప్యానెల్ వాడటం జరిగింది. అంటే మీరు బ్రైటర్ ఇమేజెస్ ని పొందుతారు. ఈ టీవీ లో 40 వాట్ పవర్ఫుల్ స్పీకర్స్, డీటీఎస్-హెచ్డీ సపోర్ట్ ఉన్నాయి.
అసలు ధర: రూ.49,999
డీల్ ధర: రూ.45,499 (బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి)