
అమెజాన్ సంస్థ యొక్క ఆటోనమస్ కార్ డివిజన్, జూక్స్, రీసెంట్ గా పబ్లిక్ రోడ్లపై ప్రయాణికులతో కూడిన తన సెల్ఫ్ డ్రైవింగ్ కారుని టెస్ట్ చేసి ఓ మైలురాయిని పూర్తి చేసింది. ఈ కారుని Robotaxi గా పిలుస్తున్నారు. ఫిబ్రవరి 11 న అమెజాన్ యొక్క జూక్స్ విభాగం తన ప్రయోగాన్ని విజయవతంగా పూర్తి చేసింది. కమర్షియల్ సర్వీస్ లో భాగంగా ఒక ఆటోనమస్ కారు ప్రయాణికులను విజయవంతంగా తరలించడం ప్రపంచంలోనే తొలిసారి అని కంపెనీ చెబుతోంది.
Amazon self-driving car విశేషాలు
2020 డిసెంబర్ లో Robotaxi ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారులో స్టీరింగ్ ఉండదు. కనీసం పెడల్స్ కూడా ఉండవు. నలుగురు ప్యాసెంజర్లను తీసుకెళ్ళే సామర్థ్యం ఈ కారు సొంతం. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 75 ఎంపీహెచ్ (120 కేఎంపీహెచ్). ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్స్ తో వస్తోంది. ఒక్కో బ్యాటరీ ప్యాక్ ఒక్కో సీట్ల వరుస క్రింద అమర్చబడి ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ కారు 16 గంటల వరకు ప్రయాణిస్తుంది.
ట్రయల్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో Zoox చీఫ్ ఐయిచా ఇవాన్స్ మాట్లాడారు. త్వరలోనే సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని ఆయన చెప్పారు. అయితే, లాంచ్ కి సంబంధించిన కచ్చితమైన సమయం ఇంకా తెలియదు.
రోబోట్యాక్సీ క్యాలిఫోర్నియాలోని జూక్స్ క్యాంపస్ లో 1.6 కిలోమీటర్ల దూరం సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్ళింది. ఈ ఆటొనమస్ కారు ట్రయల్ రన్ లో భాగంగా రెండు కంపెనీలకు చెందిన ఉద్యోగులు ప్రయాణించారు. రానున్న రోజుల్లో బయటి ప్యాసెంజర్లతో కూడా ఈ ట్రయల్ రన్ ఉంటుంది.
అయితే ఆటొనమస్ కారు ట్రయల్ రన్ ప్రపంచంలోనే ఇదే తొలిసారి కాదు. గతంలో గూగుల్ ఆధ్వర్యంలో Waymo కూడా పబ్లిక్ రోడ్ ట్రయల్ రన్ ని నిర్వహించింది. లిమిటెడ్ రైడర్స్ తో తమ ఆటొనమస్ కార్లను Waymo పరీక్షించింది. భవిష్యత్తులో కమర్షియల్ ఆటొనమస్ క్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆటొనమస్ వెహికిల్ సేఫ్టీ భద్రత అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే, 2018 మార్చిలో ఉబర్ కి చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ కారుని ఢీకొని ఒక యువతి మరణించింది. దీంతో ఆటొనమస్ కార్ల భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కాబట్టి, రియల్ వరల్డ్ పబ్లిక్ రోడ్ టెస్ట్స్ అనేవి మరింతగా చేపట్టి లోటుపాట్లను సరిదిద్దాల్సి ఉంది. అలాగే కంపెనీలు మనుషులను పసిగట్టి తదనుగుణంగా స్పందించే శక్తివంతమైన సెన్సర్స్ ని అభివృద్ధి పరచాల్సి ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











