అందుబాటులోకి వచ్చిన Android 14 Beta; ఫీచర్లు, డౌన్‌లోడ్ విధానం, అర్హత గల డివైజెస్ జాబితా తెలుసుకోండి!

Highlights

  • అఫీషియల్ గా రోలౌట్ అయిన ఆండ్రాయిడ్ 14 బీటా 1 వర్షన్
  • తొలిదశలో గూగుల్ పిక్సెల్ ఫోన్లకే రోలౌట్ పరిమితం
  • స్మార్ట్ ఫోన్లను మరింత సేఫ్, సెక్యూర్ మరియు అడ్వాన్స్డ్ గా మార్చనున్న ఆండ్రాయిడ్ 14

ఆండ్రాయిడ్ 14 బీటా 1 వర్షన్ ని గూగుల్ సంస్థ అధికారికంగా రోలౌట్ చేసింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ ఫోన్లకే అందుబాటులో ఉంది. తర్వాత మెల్లగా అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లకు రిలీజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 తో ఎన్నో కొత్త మరియు అడ్వాన్స్డ్ ఫీచర్లు వచ్చాయి.

ఆండ్రాయిడ్ 14 ఫీచర్స్

ప్రైవసీ

  • తొలుత డేటా సెక్యూరిటీ, ప్రైవసీ గురించి మాట్లాడుదాం. ఆండ్రాయిడ్ 14 ద్వారా గూగుల్ డేటా సెన్సిటివ్ యాక్సెసబులిటీని తీసుకొచ్చింది. ఇది దివ్యాంగులకు ఎంతో మేలు చేయనుంది. ఇది యాప్ ని ఫోన్ లో పరిమితంగా అవసరమైన వాటికే యాక్సెసబులిటీని పొందేందుకు అనుమతినిస్తుంది.
  • ఈ ఫీచర్ వ్యక్తిగత సమాచారం, ప్లెయిన్ టెక్ట్స్ పాస్‌వర్డ్స్ వంటి వాటిని ప్రొటెక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్‌ఫర్ మరియు షాపింగ్ యాప్స్ తదితర లావాదేవీల విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటుంది.
  • టాక్ బ్యాక్ ఫీచర్ మరియు ఆ తరహా సేవలు దివ్యాంగులైన మొబైల్ యూజర్లకు అదనపు సేవలు అందించడమే గాక, థర్డ్ పార్టీ యాప్స్ నుంచి వారి డేటాకు భద్రత కల్పిస్తుంది.
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ లేదా గేమ్స్ కి సంబంధించి సిస్టమ్ మరియు ప్రైవసీ ని ప్లే ప్రొటెక్ట్ పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుందన్నది నిజం.

పర్సనలైజేషన్

పర్-యాప్ లాంగ్వేజీ ప్రిఫరెన్సెస్.. అనేది ఆండ్రాయిడ్ యూజర్లకు వివిధ యాప్స్ ని తమ ఫోన్లపై విభిన్న భాషల్లో వాడుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనర్థం మొత్తం ఫోన్ ఒకే భాషలో నడుస్తుందని కాదు.

గ్రాఫిక్స్

థీమ్ మరియు ట్రాన్సిషన్ ఆకర్షణీయంగా ఉంటే ఫోన్ వాడటం మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 లో కూడా గూగుల్ గ్రాఫిక్స్ కేపబులిటీని పెంచింది. యాప్ ఓపెన్, యాప్ స్విచ్ మరియు విడ్జెట్స్ స్మూద్ గా పని చేయనున్నాయి.

స్మార్టర్ సిస్టమ్ యూఐ

  • ఆండ్రాయిడ్ 14 తో గూగుల్ ఫ్రేమ్ వర్క్ మరియు సిస్టమ్ యూఐ ని అడ్వాన్స్ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఫ్రేమ్ వర్క్ సర్వీసెస్ ని అందిస్తే, వాటిని కంట్రోల్ చేసే అవకాశాన్ని యూజర్ కి సిస్టమ్ యూఐ అందిస్తుంది.
  • కొత్త బ్యాక్ ఆరో (arrow) ద్వారా జెశ్చర్ నేవిగేషన్ మరింత తేలిక కానుంది. కొత్త ఓఎస్ లో, బ్యాక్ ఆరో ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఏ విండో నుంచైనా వెనక్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది.
  • షేర్ షీట్స్ మరియు పుష్ డైనమిక్ షార్ట్ కట్ ద్వారా ఫోన్ ఫైల్స్ ని యాప్స్ ద్వారా షేర్ చేయడం తేలికవుతుంది. వీటితో పాటు, డైరెక్ట్ షేర్ ఫీచర్ సింగిల్ ట్యాప్ తో ఫైల్ షేర్ చేసే వెసులుబాటుని కల్పిస్తుంది.

ఆండ్రాయిడ్ 14 బీటా 1 పొందే స్మార్ట్ ఫోన్లు ఇవే

  • Google Pixel 4a (5G)
  • Google Pixel 5
  • Google Pixel 5a
  • Google Pixel 6
  • Google Pixel 6 Pro
  • Google Pixel 6a
  • Google Pixel 7
  • Google Pixel 7 Pro

Android 14 ని ఎలా డౌన్‌లోడ్ చేసిన ఇన్‌స్టాల్ చేసుకోవాలి?

Android 14 Beta కోసం ఎన్‌రోల్ చేసుకోండి

1. తొలుత ఆండ్రాయిడ్ బీటా అధికార వెబ్ సైట్ ని మీ గూగుల్ పిక్సెల్ ఫోన్ లో ఓపెన్ చేయండి.
2. View your eligible devices అనే బటన్ ని నొక్కండి.
3. లిస్ట్ నుంచి మీ పిక్సెల్ డివైజ్ ని సెలెక్ట్ చేసుకోండి.
4. ఇక్కడ మీకు Opt in అనే బటన్ కనిపిస్తుంది. దాని పై ట్యాప్ చేసిన వెంటనే మీరు ఆండ్రాయిడ్ 14 బీటా ప్రొగ్రామ్ కి ఎన్‌రోల్ అవుతారు.

ఆండ్రాయిడ్ 14 బీటా కి మీ ఫోన్ ని అప్డేట్ చేయండి

1. ఆండ్రాయిడ్ 14 బీటా కోసం ఎన్‌రోల్ అయ్యాక, మీ పిక్సెల్ ఫోన్ లో సెట్టింగ్స్ తెరవండి.
2. సెట్టింగ్స్ లో సిస్టమ్ ఆప్షన్ కి వెళ్ళి, ఓపెన్ చేయండి.
3. సిస్టమ్ లో సిస్టమ్ అప్డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
4. మీ ఫోన్ లో కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ డౌన్‌లోడ్ అయ్యాక, ఇన్‌స్టాల్ చేసుకునేందుకు స్క్రీన్ పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.