5.9-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన ASUS Zenfone 10

Highlights

  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వచ్చిన ASUS Zenfone 10
  • 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ కలిగిన డివైజ్
  • హ్యాండ్సెట్ ప్రారంభ ధర EUR 799 (సుమారు రూ.71,305)

ASUS Zenfone 9 స్మార్ట్ ఫోన్ కి సక్సెసర్ గా ASUS Zenfone 10 ని ఆసుస్ కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ASUS Zenfone 10 లాంచ్ అయ్యింది. 5.9-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ASUS Zenfone 10 లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి.

ASUS Zenfone 10 స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.

ASUS Zenfone 10 ధర, లభ్యత

ASUS Zenfone 10 స్మార్ట్ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, కామెట్ వైట్, ఎక్లిప్స్ రెడ్, అరోరా గ్రీన్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ASUS Zenfone 10 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర EUR 799 (సుమారు రూ.71,305), 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర EUR 849 (సుమారు రూ.75,757) గా ఉంది. టాప్ మోడల్ 16జిబి+512జిబి వేరియంట్ ధర EUR 929 (సుమారు రూ.82,905) గా ఉంది. ఈ డివైజ్ యూఎస్, యూకే, కెనడా, తైవాన్, హాంగ్‌కాంగ్ మార్కెట్స్ లో కొనుగోలుకి లభించనుంది.

ASUS Zenfone 10 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: ASUS Zenfone 10 లో 5.9-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1100 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • కెమెరా: ASUS Zenfone 10 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (సోని ఐఎంఎక్స్766 సెన్సర్), 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 50ఎంపి సెన్సర్ గింబల్ స్టెబిలైజర్, అడాప్టివ్ ఈఐఎస్ కలిగి ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి కెమెరా ఉంది.
  • బ్యాటరీ: ASUS Zenfone 10 లో పవర్ బ్యాకప్ కోసం 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ASUS Zenfone 10 డివైజ్ 8జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: ASUS Zenfone 10 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆసుస్ జెన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: ASUS Zenfone 10 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: ASUS Zenfone 10 స్మార్ట్ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డైరాక్ హెచ్డీ సౌండ్, ఐపీ68 రేటింగ్, 2 మైక్రోఫోన్స్, ఓజో ఆడియో నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: ASUS Zenfone 10 లో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
Previous articleWindows keyboard షార్ట్‌కట్స్ తెలుసుకోండి!
Next articleత్వరలో లాంచ్ కానున్న Poco F6, Poco F6 Pro; లీకైన స్పెసిఫికేషన్స్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.