
షావోమి సబ్ బ్రాండ్ పోకో గత నెలలో భారత్ లో Poco F5, Poco F5 Pro లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. తాజాగా వీటి సక్సెసర్స్ అయిన Poco F6, Poco F6 Pro డివైజ్ పై పోకో సంస్థ పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. లేటెస్ట్ లీక్ లో Poco F6, Poco F6 Pro డివైజెస్ యొక్క మోడల్ నంబర్స్ మరియు స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
POCO F6 సిరీస్ IMEI లిస్ట్ వివరాలు (లీక్)
- Poco F6 సిరీస్ లిస్టింగ్ XiaomiUI కమ్యూనిటీపై కనిపించింది. Poco F6 డివైజ్ 2311DRK48G, 2311DRK48I అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది. I అనే లెటర్ ఇండియన్ వర్షన్ ని సూచిస్తుంది.
- అదే విధంగా Poco F6 Pro డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై 23113RKC6G, 23113RKC6I అనే మోడల్ నంబర్స్ తో కనిపించింది. వీటిలో కూడా గ్లోబల్ మరియు ఇండియన్ వర్షన్ మెన్షన్ చేయబడ్డాయి.
Poco F6 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)
- లీక్ ప్రకారం, Poco F6 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో లాంచ్ కానుంది.
- Poco F6 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం.
- లీక్ ప్రకారం, ఈ సిరీస్ ని కంపెనీ ప్లాస్టిక్ బాడీతో తయారు చేయదని అర్థమవుతోంది. గ్లాస్ లేదా లెదర్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్లు రానున్నాయి.
- Poco F6, Poco F6 Pro స్మార్ట్ ఫోన్స్ మెరుగైన టెలీఫోటో లెన్స్ ని కలిగి ఉంటాయని తెలుస్తోంది.
Poco F5 వివరాలు
డిస్ప్లే: Poco F5 లో 6.67-ఇంచ్ పంచ్-హోల్ స్క్రీన్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
ప్రాసెసర్: Poco F5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. 2.91 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 7జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే 12జిబి ఫిజికల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 19జిబి ర్యామ్ యూజర్ కి లభిస్తుంది.
కెమెరా: Poco F5 లో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Poco F5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











