
OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ హ్యాండ్సెట్ నార్డ్ 2 కి సక్సెసర్ గా వస్తోంది. అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో, టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని పంచుకున్నారు. లాంచ్ టైమ్‌లైన్, ధరను యోగేశ్ రివీల్ చేశారు.
మరొక లీక్ లో, OnePlus Nord 3 5G యొక్క లైవ్ ఇమేజెస్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫోన్ పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది. అయితే, ఇది నిజమో కాదో తెలియదు. ఇకపోతే మనకు కనిపించిన ఇమేజ్ చైనీస్ వేరియంట్‌ది అని భావిస్తున్నారు.
OnePlus Nord 3 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర
OnePlus Nord 3 5G డివైజ్ భారత్ లో జూన్ లో లాంచ్ కానుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇక హ్యాండ్సెట్ ధర భారత్ లో రూ.30,000 లేదా రూ.32,000 లతో ప్రారంభమవుతుందని సమాచారం.
OnePlus Nord 3 5G ఫోన్‌వే అని చెప్పబడుతోన్న లైవ్ ఇమేజెస్
- OnePlus Nord 3 5G లైవ్ ఇమేజెస్ ని @realMlgmXyysd అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. దీంతో పూర్తి డిజైన్ కనిపించింది.
- ఫోన్ ని చూస్తే, OnePlus Ace 2V మాదిరి కనిపిస్తోంది. దీంతో OnePlus Nord 3 5G ఫోన్ రీబ్రాండ్ అని భావిస్తున్నారు.
- ఇక లైవ్ ఇమేజ్ ద్వారా డిజైన్ పూర్తిగా కనిపించింది. అయితే మనకు చైనీస్ వేరియంట్ కనిపించింది. కాబట్టి ఇది గ్లోబల్ వేరియంట్ కాదని, వన్ ప్లస్ ఏస్ 2వి అని అంచనా వేస్తున్నారు.
- హ్యాండ్సెట్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఫ్లాట్ ఎడ్జెస్, న్యారో బెజెల్స్ ఉన్నాయి.
- ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. వన్ ప్లస్ బ్రాండింగ్ కూడా ఉంది.
OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే
- 1.5కే అమోలెడ్
- 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
OnePlus Nord 3 సెల్ఫీ షూటర్ కోసం 120Hz మరియు పంచ్-హోల్ కటౌట్‌తో 6.74-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే కలిగి ఉంది.
ప్రాసెసర్
- డైమెన్సిటీ 9000
ఈ హ్యాండ్‌సెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ
- 16జిబి ర్యామ్
- 256జిబి స్టోరేజీ
Nord 3 లో 12GB/16GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఉంటాయి.
ఓఎస్
- ఆండ్రాయిడ్ 13
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరాలు
- 50ఎంపి కెమెరా
- 16ఎంపి కెమెరా
OnePlus ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ లెన్స్ మరియు 2MP మూడవ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP షూటర్ ఉంటుంది.
బ్యాటరీ
- 80వాట్
- 5000ఎంఏహెచ్
ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











