బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” మూవీ ఓటీటీ అప్డేట్

Highlights

  • స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసుకున్న వీరసింహారెడ్డి చిత్రం
  • డిస్నీ+ హాట్‌స్టార్ లో ఫిబ్రవరి 23 న సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమ్ కానున్న వీరసింహారెడ్డి
  • గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిచన చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన బాలకృష్ణ, శృతిహాసన్

రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ సినిమా అంటే నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రేమికులందరికీ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో సీమ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన బాలయ్య చిత్రాలు ఘనంగా ఆడాయి. దీంతో బాలయ్య నుంచి ఈ తరహా చిత్రం వస్తుందంటే మూవీ లవర్స్ అలర్ట్ అయిపోతారు. ఎప్పుడెప్పుడు ఆ చిత్రాన్ని చూద్దామా అని ఎదురు చూస్తుంటారు.

క్రాక్ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపీచంద్ మలినేని, అటు మాస్ మహారాజా రవితేజకి కూడా కరోనా సీజన్ లో బ్లాక్‌బస్టర్ అందించారు. తర్వాత బాలయ్య తో వీరసింహారెడ్డి చిత్రాన్ని గోపీచంద్ తెరకెక్కించారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా వీరసింహారెడ్డి నిలిచింది. ఈ చిత్రం థియెట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్లే. ఈ తరుణంలో అభిమానులకు శుభవార్త వచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి.

Disney+ Hotstar లో స్ట్రీమ్ కానున్న వీరసింహారెడ్డి

నటసింహం బాలకృష్ణ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించిన వీరసింహారెడ్డి చిత్ర డిజిటల్ రైట్స్ ని డిస్నీ+ హాట్ స్టార్ కైవసం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23 న సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేయబోతున్నట్లు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. థియేటర్లలో చిత్రాన్ని చూడలేకపోయిన ఓటీటీ ఆడియన్స్ వీరసింహారెడ్డిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

చిత్ర తారాగణం

వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. మురళిశర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

వీరసింహారెడ్డి కథ

తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునే పాత్రలో బాలయ్య నటించారు. వీర సింహారెడ్డికి తన చెల్లెలు భానుకి మధ్య కలహం ఏంటి? వీరసింహారెడ్డి శత్రువు ప్రతాప్ రెడ్డి, భానుని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి-మీనాక్షి విడిపోవడానికి గల కారణం ఏంటి? తన తండ్రి చావుకి కారణమైన వారిని జయసింహారెడ్డి ఎలా మట్టుబెట్టాడనేది చిత్రం చూసే తెలుసుకోవాలి.

రెండు పాత్రల్లోనూ బాలయ్య తన నటనతో మెప్పించారు. థియెటర్లలో బాలయ్య నటనకు ఫ్యాన్స్ ఈలలు వేశారు. బాలయ్యను దర్శకుడు గోపీచంద్ మలినేని చక్కగా ప్రజెంట్ చేశారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా వీరసింహారెడ్డి నిలిచింది. ఓవరాల్ గా ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధించింది. మరి ఓటీటీ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఫిబ్రవరి 23 న సాయంత్రం 6 గంటలకు డిస్నీ+ హాట్‌స్టార్ లో వీరసింహారెడ్డి చిత్రాన్ని మీ కుటుంబ సభ్యులతో చూసి ఆనందించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.