డైమెన్సిటీ 900 చిప్, 48ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Samsung Galaxy A34 5G; లీకైన స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్
  • 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డైమెన్సిటీ 900 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy A34 5G
  • Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసిన ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung త్వరలోనే భారత్ లో Samsung Galaxy A34 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A34 5G మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ యొక్క కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే 2023 మార్చి నెలలో లాంచ్ ఉంటుందని సమాచారం. అతిత్వరలో శాంసంగ్ సంస్థ Samsung Galaxy A34 5G లాంచ్ తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈలోపు ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు నెట్టింట్లో లీకైయ్యాయి.

లేటెస్ట్ లీక్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ రివీల్ చేశాడు. ఈ లీక్ ద్వారా Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసాయి. బ్రార్ ప్రకారం, Samsung Galaxy A34 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A34 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ Galaxy A33 5G కి సక్సెసర్ గా వచ్చింది. గతేడాది ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ గతంలో కూడా లీకైయ్యాయి. అయితే బ్రార్ లీక్ ద్వారా Samsung Galaxy A34 5G ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ అన్నీ బయటకు వచ్చాయి.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుందని లీకైన రెండర్స్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్ ఉంటుంది. ఎగ్జినోస్ 1280 లేదా డైమెన్సిటీ 900 చిప్ ఉండే అవకాశం ఉందని గత నివేదికలు తెలిపాయి.

Samsung Galaxy A34 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ లో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఐపీ67 రేటింగ్, వై-ఫై 6, తదితర ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో Samsung Galaxy A34 5G ఫోన్ లభించనుంది. యూరప్ లో ఈ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 530 యూరోలు (సుమారు రూ.46,900 నుంచి రూ.48,700) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 590 నుంచి 610 యూరోలు (సుమారు రూ.52,200 నుంచి రూ.54,000) గా ఉంది. భారత్ లో మాత్రం Samsung Galaxy A34 5G ధర చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleVideo: Xiaomi 13 Lite 5G అన్‌బాక్సింగ్ వీడియో
Next articleబాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” మూవీ ఓటీటీ అప్డేట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.