
స్మార్ట్‌ఫోన్ కొనేముందు మనమంతా చూసే ప్రధాన స్పెసిఫికేషన్స్‌లో కెమెరా విభాగం కూడా ఒకటి. కొందరైతే, కేవలం కెమెరా కోసమే ఫోన్ కొనుగోలు చేస్తుంటారు. మీరు గనుక, రూ.30,000 లోపు ధరలో ఒక మంచి కెమెరా ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ఆర్టికల్ మీకోసమే. 91మొబైల్స్ మీకోసం బెస్ట్ కెమెరా ఫోన్ల జాబితాను అందించింది. వాటి స్కోర్ ఆధారంగా ఈ లిస్ట్ ను రూపొందించడం జరిగింది. ఆ జాబితాలో ఏయే ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందామా?
రూ.30,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు
OnePlus Nord 4
OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ లో అందించిన కెమెరా సిస్టమ్ పర్వాలేదనిపించేలా ఉంది. గొప్పగా ఏమీ లేదు. డే లైట్ కండిషన్స్ లో ఫోటోలు నేచురల్ గా ఉన్నాయి. 50ఎంపి మరియు 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరాలకు మధ్య మంచి కలర్ కన్సిస్టెన్సీ ఉంది. అయితే 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ వార్మ్ ఇమేజెస్ ను ప్రొడ్యూస్ చేస్తోంది.
ఇక 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫోటోలు పొట్రెయిట్ మోడ్ లో నేచురల్ గా కనిపిస్తున్నాయి. సాధారణమైన పాయింట్-అండ్-షూట్ సెల్ఫీస్ కాస్త డల్ గా కనిపించవచ్చు. అయితే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
OnePlus Nord 4 డిమ్ కండిషన్స్ లో కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అయితే అందుకోసం, ఎక్స్‌పోజర్ టైమ్‌ను పెంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్లన ఎక్కువ లైట్‌ను క్యాప్చర్ చేయడంతో మంచి ఫోటోలు తీసుకునే వీలుంటుంది.
ఏదేమైనా, అత్యంత తక్కువ లో-లైట్ కండిషన్స్ లో ఈ ఫోన్ లోని కెమెరా పనితనం మెరుగ్గా లేదు. నైట్ మోడ్ కూడా ఈ విషయంలో ఏ సాయం చేయలేదు.
ఓవరాల్‌గా OnePlus Nord 4 లో మంచి కలర్ కన్సిస్టెన్సీ, నేచురల్-లుకింగ్ పొట్రెయిట్ సెల్ఫీస్ అనేవి ప్లస్ పాయింట్లు.
OnePlus Nord 4 లో లో-లైట్ పనితీరు, అల్ట్రావైడ్ షాట్స్ లోని వార్మ్‌నెస్ మైనస్ పాయింట్లు అని చెప్పవచ్చు.
Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro లో అందించిన కెమెరా పనితీరు మంచి లైటింగ్ ఉన్న పరిస్థితుల్లో డీటెయిల్స్, షార్ప్‌నెస్ విషయాల్లో బాగుంది. డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. అయితే డిఫాల్ట్‌గా ఇవ్వబడిన కలర్ రీప్రొడక్షన్ హై కాంట్రాస్ట్ తో ఎక్కువగా కొట్టొచ్చినట్లు కనిపించవచ్చు. 10ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్ తో తీసిన ఫోటోల్లో కలర్ షిఫ్ట్ కనిపిస్తోంది. అలాగే షార్ప్‌నెస్ మరియు డీటెయిల్స్ సరిగ్గా లేవు. మరోవైపు 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ కొంచెం ఎడ్జ్ డిస్టార్షన్ ఉన్నప్పటికీ, చక్కటి ఇమేజెస్ ను షూట్ చేస్తోంది.
ఇక 50ఎంపి ప్రైమరీ కెమెరా యొక్క లో-లైట్ పనితీరు ఎక్కువగా కనిపించే షాడోస్, కంట్రోల్డ్ హైలైట్స్ తో పర్వాలేదనిపించేలా ఉంది. 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఫేషియల్ డీటెయిల్స్ విషయంలో మంచి బ్యాలన్స్ కలిగి ఉంది. కానీ, కొన్నిసార్లు కొట్టొచ్చే రంగులతో సెల్ఫీస్ కనిపిస్తున్నాయి.
Motorola Edge 50 Pro లో ఉత్తమమైన డైనమిక్ రేంజ్, మంచి లో-లైట్ పెర్ఫామెన్స్ అనేవి ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు.
Motorola Edge 50 Pro లో యావరేజ్ కలర్ రీప్రొడక్షన్, నాసిరకం ఎడ్జ్ డిస్టార్షన్ అనేవి మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి.
POCO F6
POCO F6 లో అందించిన 50ఎంపి మెయిన్ కెమెరా మెరుగైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తోంది. కన్సిస్టెంట్ కలర్ క్యాలిబ్రేషన్, కాంట్రాస్ట్ అనేవి బాగున్నాయి. 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ పనితీరు యావరేజ్ గా ఉంది.
లో-లైట్ కండిషన్స్ లో ఇమేజ్ క్వాలిటీ బాగాలేదు. ఎక్కువగా నాయిస్, తగ్గించబడిన డీటెయిల్స్, షార్ప్‌నెస్ ని ఇమేజెస్ లో గమనించవచ్చు. ఇక్కడ నైట్ మోడ్ ద్వారా నాయిస్‌ను తగ్గించుకోవచ్చు.
POCO F6 లోని 20ఎంపి కెమెరా డేలైట్ కండిషన్స్ లో దాదాపుగా సరైన స్కిన్ టోన్స్ క్యాప్చర్ చేస్తోంది. కానీ, ఫేషియల్ డీటెయిల్స్ అనేవి స్మూథింగ్ వల్లన మసకబారిపోతున్నాయి. పొట్రెయిట్ మోడ్ చక్కటి ఎడ్జ్ డిటెక్షన్ ను అందిస్తోంది. కానీ, బొకే ఎఫెక్ట్ అసహజంగా కనిపించవచ్చు.
POCO F6 డివైజ్ లో కన్సిస్టెంట్ కలర్ క్యాలిబ్రేషన్ మరియు చక్కటి డైనమిక్ రేంజ్ అనేవి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి.
POCO F6 లో యావరేజ్ లో-లైట్ పెర్ఫామెన్స్, సెల్ఫీస్ లో కనిపించే స్మూథ్‌నెస్ అనేవి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి.
Samsung Galaxy M55
Samsung Galaxy M55 లో ఇచ్చిన 50ఎంపి ప్రైమరీ కెమెరా యొక్క డేలైట్ పనితీరు చాలా బాగుంది. చూడటానికి ఆకర్షణీయమైన, వెల్-ఎక్స్‌పోజ్డ్ ఇమేజెస్, గుడ్ డీటెయిల్స్ ను ఈ కెమెరా ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే కలర్ ఆక్యురెసీ పర్ఫెక్ట్ గా లేదు.
8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ వెలుతురు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో బాగానే పెర్ఫామ్ చేస్తోంది. అయితే ఎడ్జ్ వార్పింగ్, లెస్ వైబ్రంట్ కలర్స్ ను గమనించవచ్చు. ఇక 2ఎంపి మ్యాక్రో షాట్స్ డీటెయిల్స్ ను అంతగా అందించలేవని చెప్పవచ్చు.
Samsung Galaxy M55 డివైజ్ లో ఎక్స్‌లెంట్ డీటెయిల్స్, ఎక్స్‌పోజర్ మరియు నేచురల్-లుకింగ్ పొట్రెయిట్స్ అనేవి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. నాసీరకం కలర్ ఆక్యురెసీ, యావరేజీ లో-లైట్ పెర్ఫామెన్స్ అనేవి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి.
Realme 12 Pro+
Realme 12 Pro+ లో 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ 120ఎక్స్ డిజిటల్ జూమ్ తో వచ్చింది. అయితే 6ఎక్స్ తర్వాత డిజిటల్ జూమ్ అనేది పెద్దగా ప్రభావం చూపదు. నాణ్యత లోపిస్తుంది. 3ఎక్స్ జూమ్ మంచి డైనమిక్ రేంజ్, కలర్ యాక్యురెసీతో ఉత్తమమైన ఫలితాలను అందిస్తోంది.
50ఎంపి ప్రైమరీ కెమెరా డీటెయిల్స్, షార్ప్‌నెస్ విషయాల్లో బాగుంది. కానీ, కాస్త ఓవర్‌సాచురేటెడ్ కలర్స్ గమనించవచ్చు. ఫోటో మరియు పొట్రెయిట్ మోడ్స్ లో గుడ్ షాడో డీటెయిల్స్, కన్సిస్టెంట్ స్కిన్ టోన్స్ క్యాప్చర్ అవుతున్నాయి. అయితే పొట్రెయిట్ షాట్స్ లో ఫేస్ లోని కొన్ని బాగాలు బ్లర్ గా కనిపిస్తున్నాయి.
8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా వెలుతురు బాగున్నప్పుడు షార్ప్ మరియు వైబ్రంట్ ఇమేజెస్ ను క్యాప్చర్ చేస్తోంది. తక్కువ వెలుతురు ఉన్నప్పుడు దీని పనితీరు బాగాలేదు.
నైట్ మోడ్ ద్వారా ఇమేజెస్ లోని నాయిస్ మరియు స్మూథ్నెస్ డీటెయిల్స్ తగ్గించుకుని క్లీనర్ ఇమేజెస్ పొందే వీలుంది. కస్టమైజ్డ్ టిల్ట్ ఓఐఎస్ ద్వారా లో-లైట్ ఫోటోగ్రఫీని మెరుగుపరచవచ్చు. దీని కోసం లైట్ ఫ్లేర్ తగ్గించి, స్టెబిలిటీని మెరుగుపరచాల్సి ఉంటుంది. 32ఎంపి ఫ్రంట్ కెమెరా గుడ్ స్కిన్ టోన్స్ మరియు స్లైట్ స్మూథెనింగ్ తో కూడిన ఫోటోలను క్యాప్చర్ చేస్తోంది. కానీ ఫోకసింగ్ మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ డిలే అనేవి సమస్యలుగా ఉన్నాయి.
Realme 12 Pro+ లో స్పష్టమైన లో-లైట్ ఇమేజెస్, మంచి డైనమిక్ రేంజ్ మరియు కలర్ కన్సిస్టెన్సీ అనేవి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. నాసీరకమైన డిజిటల్ జూమ్ నాణ్యత, ఫోకసింగ్ ఇష్యూస్ అనేవి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి.
Nothing Phone (2a)
డేలైట్ లో Nothing Phone (2a) లోని 50ఎంపి రియర్ కెమెరాలు ఆకట్టుకునే ఇమేజెస్ క్యాప్చర్ చేశాయి. డీటెయిల్స్, డైనమిక్ రేంజ్, హై కాంట్రాస్ట్, షార్ప్‌నెస్ వంటి విషయాలు మెరుగ్గా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ మంచి డైనమిక్ రేంజ్ మరియు కాంట్రాస్ట్ తో కూడిన డీసెంట్ షాట్స్ తీసింది.
లో లైట్ లో కెమెరాలు ఆటోమేటిక్‌గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. దీంతో ఇమేజెస్.. క్రిస్ప్, షార్ప్ మరియు వైబ్రంట్ గా ఉంటూ, తక్కువ నాయిస్ కలిగి ఉన్నాయి. ఇక నైట్ మోడ్ ఆఫ్ చేస్తే, తక్కువ నాణ్యత గల ఇమేజెస్ వచ్చాయి. ఏదేమైనా, గ్లైఫ్ ఇంటర్ఫేస్ అదనపు లైటింగ్ ను అందజేస్తోంది.
Nothing Phone (2a) లో అందించిన 32ఎంపి ఫ్రంట్ కెమెరా డేలైట్ లో బాగా పెర్ఫామ్ చేస్తోంది. మంచి ఎక్స్‌పోజర్, స్కిన్ టోన్స్ తో సెల్ఫీస్, క్యాప్చర్ అవుతున్నాయి. అయితే, లో లైట్ లో మాత్రం రియర్ కెమెరాల మాదిరి పనితనం ఫ్రంట్ కెమెరాలో లేదు.
మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్, అదనపు లైటింగ్ అందిస్తున్న గ్లైఫ్ ఇంటర్ఫేస్ అనేవి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి.
అల్ట్రావైడ్ షాట్స్ లో కలర్ షిఫ్ట్, సెల్ఫీస్ లో నాసీరకం లో-లైట్ పెర్ఫామెన్స్ అనేవి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి.
OPPO F27 Pro+
OPPO F27 Pro+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ కెమెరాలో ఏఐ పోట్రెయిట్ రీటచింగ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా సెల్ఫీస్ నాణ్యత మరింత మెరుగవుతుంది.
డేలైట్ లో మంచి డీటెయిల్స్ మరియు కలర్ ఆక్యురెసీతో కూడిన డీసెంట్ షాట్స్ వస్తున్నాయి. సరైన, లైవ్లీ కలర్స్, డీటెయిల్స్ గల ఇమేజెస్ ను ఎఫ్27 ప్రో+ క్యాప్చర్ చేస్తోంది.
తక్కువ వెలుతురు ఉన్నప్పుడు మరియు రాత్రి సమయాల్లో ఈ ఫోన్ బ్యాండింగ్ ఇష్యూస్‌ను కలిగి లేదు. లోలైట్ లో డీటెయిల్స్ క్యాప్చర్ చేయడంలో ఈ ఫోన్ మెయిన్ కెమెరా పనితనం మెరుగ్గా లేదు. దీని వల్లన ఇమేజెస్ లోని చీకటి ప్రాంతాలు, డార్క్ ప్యాచెస్ గా కనిపిస్తున్నాయి.
డీటెయిల్స్, కలర్ ఆక్యురెసీ, ఏఐ ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి.
లో-లైట్ డీటేయిలింగ్, ఔట్‌లైన్ క్యాప్చరింగ్ వంటి విషయాలు మైనస్ పాయింట్లుగా ఉన్నాయి.