
తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే వాల్యూ ఫర్ మనీ ఫోన్ల కోసం సగటు వినియోగదారుడు వెతుకుతుంటాడు. కొందరికీ, కెమెరా ఫోన్ పై ఇష్టముంటే, మరికొందరికి గేమింగ్ ఫోన్ కొనాలని ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు భారత్ లో లభిస్తోన్న బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం. మేం పలు బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఆధారంగా అలాగే సొంతంగా కొన్ని టెస్టులను నిర్వహించి, ఏ ఫోన్ సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఓసారి పూర్తిగా చదివి తెలుసుకోండి.
రూ.20,000 లోపు ధరలో బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు
| స్మార్ట్‌ఫోన్ | లాంచ్ తేదీ | ధర |
| ఐకూ జెడ్ 9 | మార్చి 12, 2024 | రూ.19,999 |
| రియల్మీ నార్జో 70 టర్బో | సెప్టెంబర్ 9, 2024 | రూ.16,999 |
| వివో టీ3 | మార్చి 21, 2024 | రూ.19,999 |
| ఐకూ జెడ్9ఎస్ | ఆగస్టు 21, 2024 | రూ.19,999 |
| సీఎంఎఫ్ ఫోన్ 1 | జులై 8, 2024 | రూ.15,999 |
iQOO Z9
iQOO Z9 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 12వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.19,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ సాలిడ్ బెంచ్‌మార్క్ స్కోర్స్ కలిగి ఉంది.
| బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ | స్కోర్ |
| అంటుటు | 7,28,534 |
| గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) | 1,190 |
| గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) | 2,681 |
| పీసీమార్క్ (పెర్ఫామెన్స్) | 11,218 |
Realme Narzo 70 Turbo
Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.16,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. వివిధ బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్స్ పై నార్జో 70 టర్బో మంచి ప్రదర్శన కనబరిచింది.
| బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ | స్కోర్ |
| అంటుటు | 7,26,959 |
| గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) | 1,052 |
| గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) | 2,969 |
| పీసీమార్క్ (పెర్ఫామెన్స్) | 14,895 |
Vivo T3
Vivo T3 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. సాధారణ గేమింగ్ మరియు డే-టు-డే వాడకానికి ఈ ఫోన్ బాగా సరిపోతుంది.
| బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ | స్కోర్ |
| అంటుటు | 7,15,922 |
| గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) | 1,177 |
| గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) | 2,646 |
| పీసీమార్క్ (పెర్ఫామెన్స్) | 11,423 |
iQOO Z9s
iQOO Z9s స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఓసారి ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.
| బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ | స్కోర్ |
| అంటుటు | 7,02,922 |
| గీక్‌బెంచ్ సింగిల్-కోర్ | 1,044 |
| గీక్‌బెంచ్ మల్టీ-కోర్ | 3,011 |
| పీసీమార్క్ (పెర్ఫామెన్స్) | 10,918 |
CMF Phone 1
CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ జులై 8వ తేదీన రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. రోజువారీ సాధారణ వాడకానికి, లైట్ గేమింగ్‌కి ఈ ఫోన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.
| బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ | స్కోర్ |
| అంటుటు | 6,42,187 |
| గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) | 1,015 |
| గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) | 2,867 |
| పీసీమార్క్ (పెర్ఫామెన్స్) | 11,598 |