హైలైట్స్
- కొత్త రీచార్జ్ ప్లాన్ ని అనౌన్స్ చేసిన ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL
- ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న బీఎస్ఎన్ఎల్
- ప్లాన్ బెనిఫిట్స్: 12 నెలల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, డెయిలీ డేటా

BSNL 12 నెలల రీచార్జ్ ప్లాన్: ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ BSNL ప్రయివేటు కంపెనీలైన జియో, ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా లకు గట్టి పోటీ ఇస్తోంది. అలాగే ప్రయివేటు టెలీకామ్ కంపెనీల కంటే BSNL వద్ద అద్భుతమైన, చవకైన ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిసి BSNL ని రేసులో నిలబెడుతున్నాయి.
తాజాగా BSNL 12 నెలల వ్యాలిడిటీ గల రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఒక్కసారి ఈ రీచార్జ్ చేస్తే ప్రతి నెలా రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే యూజర్లు ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం, ఎస్ఎంఎస్ లు, డేటా వంటి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం. చదివి తెలుసుకోండి.
రూ.1499 రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన BSNL
BSNL కొత్తగా ప్రవేశపెట్టిన రూ.1499 రీచార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే రోజుకి కేవలం 4 రూపాయల 1 పైసా ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, 24జిబి ఇంటర్నెట్ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి. అయితే అత్యధికంగా డేటాను వినియోగిస్తే గనుక ఈ ప్లాన్ మీకు నచ్చకపోవచ్చు. అలాగే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్ ని యాక్టివేట్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్ నుంచి PLAN BSNL1499 అని టైప్ చేసి 123 కి ఎస్ఎంఎస్ చేయండి.
2023 ఆగస్టు 15 న పెద్ద ప్రకటన చేయనున్న BSNL
BSNL 5జీ లాంచ్ ఎప్పుడా అంటూ ఇటీవల ఒక వార్త వినిపించింది. అయితే ఎక్కువ శాతం BSNL 4జీ గురించే చర్చలు జరిగాయి. ఓ కథనం ప్రకారం, టీసీఎస్ తో కలిసి BSNL తొలుత 4జీ సేవలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. రెవెన్యూ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఈ సేవలు మొదలవుతాయి. అయితే ఇప్పటికే 4జీ-రెడీ ఇన్ఫాస్ట్రక్చర్ సిద్ధంగా ఉన్నందున దేశమంతా త్వరలోనే రోలౌట్ కానుంది.
అలాగే, BSNL 5జీ సేవలు 2023 ఆగస్టు 15 న భారత్ లో ప్రారంభమవుతాయి. అయితే ఈ 5జీ నెట్వర్క్ No Stand Alone (NSA) మోడ్ లో యూజర్లకు అందుతుంది. ఏదేమైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న BSNL పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇంకా 3జీ సేవలనే అందిస్తూ బండిని లాక్కొని రావడం BSNL కే చెల్లింది. BSNL పట్ల పలువురు యూజర్లు సంతృప్తిగా లేరు. ప్రభుత్వం ఇటీవలె BSNL కి ప్యాకేజీ ప్రకటించడం శుభ పరిణామం. అయితే, ఆ నిధులు సక్రమంగా ఖర్చై 4జీ అటు తర్వాత 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే బాగుంటుంది. లేదంటే, BSNL పరిస్థితి ఎప్పటిలాగే ఉంటుంది. జనాల్లో BSNL పట్ల మరింత నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం BSNL అందిస్తోన్న రీచార్జ్ ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయి. నెట్వర్క్ పరంగా కూడా అప్‌గ్రేడ్ అయితే అప్పుడు BSNL కి తిరుగుండదు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













