Snapdragon 8 Gen 2 చిప్, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్న Moto X40; రివీల్ అయిన డిజైన్

హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Moto X40
  • TENAA లిస్టింగ్ పై కనిపించిన Moto X40, రివీల్ అయిన డిజైన్
  • కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోన్న Moto X40 స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా త్వరలోనే Moto X40 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Moto X30 కి ఈ ఫోన్ సక్సెసర్ గా వస్తోంది. గ్లోబల్ గా మోటో ఎక్స్30, మోటో ఎడ్జ్ 30 పేరుతో లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు Moto X40 కూడా గ్లోబల్ గా మోటో ఎడ్జ్ 40 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Moto X40 ఫోన్ TENAA లిస్టింగ్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా లీకైన డిజైన్ ని బట్టి, Moto X40 కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్నట్లు స్పష్టమైంది.

లెనొవొ చైనా మొబైల్ మేనేజర్ చెన్ జిన్ రీసెంట్ గా చైనా సామాజిక మాధ్యమం వీబో పై Moto X40 కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేశారు. ఆయన ప్రకారం, Moto X40 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో రానున్నట్లు స్పష్టమైంది.

త్వరలో లాంచ్ కానున్న Moto X40 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. వన్ ప్లస్ 11, ఐకూ 11 సిరీస్, షావోమీ 13 సిరీస్, వివో ఎక్స్90 సిరీస్ తదితర వాటితో Moto X40 పోటీ పడనుంది. ఈ ఏడాది ఆఖర్లో Moto X40 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

రీసెంట్ గా Moto X40 డివైజ్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఇప్పుడు TENAA టెలీకామ్ ఆథారిటీ సైట్ ద్వారా Moto X40 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto X40 గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు

TENAA లిస్టింగ్ ప్రకారం, త్వరలో రానున్న Moto X40 కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది. డిస్ప్లే ఫీచర్లను పక్కనబెడితే, రెండర్ ఇమేజెస్ ద్వారా Moto X40 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని స్పష్టమవుతోంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో స్క్వేర్ షేప్ లో కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది.

Moto X40 ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ కనిపిస్తున్నాయి. డిస్ప్లేని చూస్తుంటే అందులోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎంబెడ్ కాబడి ఉందని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ తో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ ప్యానెల్ పై మోటోరోలా అని టెక్ట్స్ తో పాటు లోగో కూడా ఉంది. ఇవి కాకుండా TENAA ద్వారా ఇంకా ఏ కూడా స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు.

Moto X40 స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీకైన రూమర్ల ద్వారా Moto X40 యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒక అవగాహన వచ్చింది. అవేంటో ఓసారి చూద్దాం పదండి. Moto X40 లేటెస్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. Moto X40 12జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో పాటు 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని తెలుస్తోంది.

Moto X40 భారత్ లో వచ్చ ఏడాది లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ల ధరలు ఈసారి భారీగానే ఉంటాయని సమాచారం. డాలర్ పై రూపాయి విలువ పడిపోవడం, సెమీకండక్టర్స్ కొరత వంటివి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. మరి మోటోరోలా భారత్ లో Moto X40 ని ఏ ధరతో లాంచ్ చేస్తుందోననే విషయం ఆసక్తికరంగా మారింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.