హైలైట్స్:
- అద్భుతమైన ప్లాన్ ని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్, 300 రోజుల వ్యాలిడిటీ, నెలకు 75జిబి డేటా
- మొదటి 60 రోజులకు పరిమితం కానున్న డేటా ప్రయోజనం, తర్వాత డేటా కావాలంటే రీచార్జ్ తప్పనిసరి
- కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.2,022, ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉండనున్న ప్లాన్
ప్రభుత్వ రంగ టెలీకామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఓ చక్కటి ప్రీ-పెయిడ్ ప్లాన్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. రూ.2022 ధర ఉన్న ఈ ప్లాన్ ని రీచార్జ్ చేస్తే 300 రోజుల వ్యాలిడిటీ తో పాటు నెలకు 75జిబి డేటా వస్తుంది. అయితే ఈ డేటా ప్రయోజనం మొదటి 60 రోజులకు మాత్రమే వర్తించనుంది. తర్వాత వినియోగదారులు డేటా కోసం రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్లాన్ లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజుకి 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.
అధిక వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. కాగా, ఈ ప్లాన్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్స్ లో ఆగస్టు 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీచార్జ్ తో 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే నెలకు 75జిబి డేటా లభించనుంది. డేటా 60 రోజుల వరకు మాత్రమే పరిమితమని గమనించాలి. తర్వాత డేటా వోచర్స్ తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డేటా లిమిట్ దాటాక స్పీడ్ 40కేబీపీఎస్ కి పడిపోతుంది.
“బీఎస్ఎన్ఎల్ తన సబ్స్క్రైబర్లకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. అలాగే వినియోగదారులకు అందుబాటు ధరలో ప్లాన్స్ ని అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. తమ ఖాతాలను రీచార్జ్ చేసుకునేందుకు డిజిటల్ బాట పట్టాలని మేం సబ్స్క్రైబర్లను కోరుతున్నాం. అందుకోసం, బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ మొబైల్ యాప్ తో పాటు, బీఎస్ఎన్ఎల్ వెబ్ సైట్, ఇతర వాలెట్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి.” అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పుర్వర్ చెప్పారు.
BSNL 5G సేవలు
ఇక బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలవుతాయని టెలీకమ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీ-డాట్) 5జీ నాన్-స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) కోర్ నెట్వర్క్ పై పని చేస్తోందని, అది ఆగస్టు చివరి కల్లా పూర్తవుతుందని మినిస్టర్ చెప్పారు. అలాగే డిసెంబర్ లో క్షేత్రస్థాయిలో పరీక్షలు జరుతాయన్నారు. ఇక వచ్చే ఏడాది కల్లా, బీఎస్ఎన్ఎల్ లో 5జీ స్టాక్ ని డెప్లాయ్ అవుతుందని అన్నారు. ఏకకాలంలో 4జీ, 5జీ నెట్వర్క్ లను నెలకొల్పేందుకై పనులు కొనసాగుతున్నాయి. తొలుత బీఎస్ఎన్ఎల్ 4జీ రంగ ప్రవేశం చేశాక, వెనువెంటనే 5జీ సేవలు మొదలవ్వనున్నట్లు సమాచారం. అందుకోసం బీఎస్ఎన్ఎల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తో కలిసి పని చేస్తోంది.
BSNL 4G సేవలు
టీసీఎస్ మరియు సీ-డాట్ కలిసి బీఎస్ఎన్ఎల్ కి రేడియో మరియు కోర్ నెట్వర్క్ ఎక్విప్మెంట్ ని సరఫరా చేయనున్నాయి. ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ కోసం అంబాలా మరియు చండీఘర్ లు ఎంపిక కాబడ్డాయి. ఈ ఏడాది మొదట్లో బీఎస్ఎన్ఎల్ రూ.550 కోట్ల కాంట్రాక్ట్ ని టీసీఎస్ కు ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, టీసీఎస్ 6000 సైట్స్ ని ఏర్పాటు చేయనుంది. 4జీ సేవలను ప్రారంభించేందుకై, దేశ వ్యాప్తంగా మొత్తం 1.12 లక్షల సైట్స్ ని డెప్లాయ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.















