BSNL రూ.185 ప్లాన్: ఉచిత Gaming Service తో పాటు మరెన్నో బెనిఫిట్స్

హైలైట్స్

  • గేమింగ్ సేవలతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ని అందిస్తోన్న BSNL
  • రూ.185 ప్లాన్ లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు అన్‌లిమిటెడ్ డేటా
  • చాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ తో వస్తోన్న BSNL రూ.185 ప్లాన్

భారతదేశంలోని ప్రముఖమైన టెలీకామ్ సంస్థల్లో BSNL ఒకటి. ప్రభుత్వం చేత నడపబడుతోన్న ఒకే ఒక్క టెలీకామ్ కంపెనీ ఈ BSNL. ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని యూజర్లకు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించింది BSNL. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్స్ కావాలనుకునే వారు BSNL యూజర్ గా మారడం సాధారణమైన విషయంగా మారిపోయింది.

దేశంలో టాప్-2 ప్లేసెస్ లో ఉన్న ఎయిర్టెల్, జియో సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ BSNL తన బండిని ముందుకు లాగిస్తోందంటే దానికి ప్రధాన కారణం తన వద్ద ఉన్న వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్. ఈ ప్లాన్సే యూజర్లను BSNL వైపు మళ్ళించేందుకు సాయం చేస్తున్నాయి. త్వరలోనే 4జీ సేవల్ని, ఆ వెనువెంటనే 5జీ సేవలను లాంచ్ చేయాలనే లక్ష్యంతో BSNL పని చేస్తోంది.

సరే, ఇప్పుడు మనం BSNL అందిస్తోన్న రూ.185 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. తక్కువ ధర కలిగిన ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా గేమ్స్ ఎక్కువగా ఆడే వారికి ఈ ప్లాన్ ద్వారా ఉచిత గేమింగ్ సేవలు లభించనున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.

BSNL రూ.185 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

  • డెయిలీ 1జిబి డేటా
  • 28 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత వాయిస్ కాల్స్
  • చాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్
  • ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్

రూ.185 విలువగల BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ప్రతిరోజూ 1జిబి డేటా లభిస్తుంది. 1జిబి పరిధి ముగిశాక, డేటా స్పీడ్ 40కేబీపీఎస్ కి పడిపోతుంది. అయితే మీరు మాత్రం ఉచితంగా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఇకా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు ఈ ప్లాన్ తో లభిస్తాయి. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ ప్లాన్ ద్వారా లభించే అదనపు ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

BSNL రూ.185 ప్లాన్ ద్వారా లభించే అదనపు ప్రయోజనాలు

BSNL రూ.185 ప్లాన్ ద్వారా డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ మాత్రమే కాదండోయ్, ఇంకా చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ తో చాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ ఉచితంగా లభిస్తాయి. ఈ ఉచిత గేమింగ్ సేవలను మీరు ప్రొగ్రసివ్ వెబ్ యాప్ ద్వారా పొందవచ్చు. ఇంకా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా ఉచితంగా లభిస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article2024 లో లాంచ్ కానున్న Xiaomi Electric Car
Next articleJio 5G కి సపోర్ట్ చేసే 10 Motorola స్మార్ట్ ఫోన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.