హైలైట్స్
- Jio 5G కి సపోర్ట్ చేస్తున్న 10 మోటోరోలా స్మార్ట్ ఫోన్స్
- లిస్ట్ లో ఉన్న ప్రముఖ ఫోన్స్ Motorola Edge 30 Ultra, Motorola Edge 20 Fusion
- Airtel 5G ప్లస్ హై-స్పీడ్ నెట్వర్క్ సర్వీస్ కి కూడా సపోర్ట్ చేయనున్న మోటోరోలా డివైజెస్
Jio 5G సర్వీసెస్ కి యాక్సెస్ అయ్యేందుకై మోటోరోలా కంపెనీ కొన్ని ఎంపిక చేయబడిన మోటో డివైజెస్ కి కొత్త అప్డేట్ పంపింది. ఈ అప్డేట్ ద్వారా సంబంధిత మోడల్స్ వాడుతోన్న యూజర్లు జియో 5జీని వాడుకోవచ్చు. ఈ జాబితాలో మొత్తం 10 మోటోరోలా ఫోన్లు ఉన్నాయి. 4జీ ప్లాన్స్ పై కొనసాగుతోన్న జియో యూజర్లు ఇప్పుడు జియో యొక్క 5జీ వెల్కమ్ ఆఫర్ ని పొందేందుకు ప్రయత్నించవచ్చు.
జియోతో పాటు, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు 21 భారతీయ నగరాల వ్యాప్తంగా ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను పొందే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
Jio 5G సేవలను పొందే Motorola స్మార్ట్‌ఫోన్స్
Jio 5G కి సపోర్ట్ చేసే మోటోరోలా ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.
- Motorola Edge 30 Ultra
- Motorola Edge 30 Fusion
- Moto G62 5G
- Motorola Edge 30
- Moto G82 5G
- Motorola Edge 30 Pro
- Moto G71 5G
- Moto G51 5G
- Motorola Edge 20
- Motorola Edge 20 Fusion
మోటోరోలా తో పాటు, రిలయన్స్ జియో సంస్థ జియో 5జీ సేవలను అందించేందుకై పాపులర్ బ్రాండ్స్ అయిన రియల్మీ, వన్‌ప్లస్ మరియు షావోమి లతో జట్టుకట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాలు, నగరాల వ్యాప్తంగా జియో ట్రూ 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది.
జియో 5జీ నెట్వర్క్ ని 16 వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వాటిలో వన్ ప్లస్ 10ఆర్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, వన్ ప్లస్ నార్డ్ 2, వన్ ప్లస్ 10 ప్రో, వన్ ప్లస్ 9 ఆర్‌టీ, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 8 డివైజెస్ ఉన్నాయి.
ఇకపోతే రియల్మీకి చెందిన 16 స్మార్ట్ ఫోన్లు జియో ట్రూ 5జీకి సపోర్ట్ చేస్తాయి. వాటిలో రియల్మీ జీటీ నియో 2, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ జీటీ 2 ప్రో, రియల్మీ జీటీ నియో 3 తదితర ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ జియో అందించే హై-స్పీడ్ 5జీ డేటాకి యాక్సెస్ కలిగి ఉన్నాయి. ఇక రెడ్మీ, షావోమి విషయానికి వస్తే, రెడ్మీ నోట్ 10టీ 5జీ, రెడ్మీ నోట్ 11టీ 5జీ, షావోమి 12 5జీ, షావోమీ 11ఎక్స్ ప్రో, షావోమి 11ఐ హైపర్ చార్జ్ 5జీ, షావోమి 11 అల్ట్రా 5జీ ఉన్నాయి.
ప్రస్తుతం రిలయన్స్ జియో 5జీ ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో అందుబాటులో ఉంది. జియో 5జీ ఇంకా ఇండోర్, భోపాల్ నగరాల్లో కూడా ఇటీవలె అందుబాటులోకి వచ్చింది. 2023 జనవరిలో జబల్‌పూర్, గ్వాలియర్ నగరాల్లో కూడా అందుబాటులోకి రానుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












