
ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎన్నో చక్కటి ప్లాన్స్ ని తన వినియోగదారుల కోసం అందిస్తోంది. అగ్ర టెలీకామ్ సంస్థలైన ఎయిర్టెల్, జియో లకు బీఎస్ఎన్ఎల్ తన వద్ద ఉన్న చవకైన ప్లాన్స్ తో గట్టి పోటీ ఇస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ కి చెప్పుకోదగిన రేంజ్ లో కస్టమర్లు ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ కి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంతో, బీఎస్ఎన్ఎల్ సంస్థ టీసీఎస్ తో జట్టుకట్టి 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరింపజేసేందుకు కృషి చేస్తోంది. అలాగే త్వరలోనే 5జీ నెట్వర్క్ ని కూడా ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టకుంది.
బీఎస్ఎన్ఎల్ వద్ద ఎన్నో చవకైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఈ ప్లాన్స్ ద్వారా పొందవచ్చు. వివిధ బడ్జెట్ శ్రేణుల్లో ఈ ప్లాన్స్ లభిస్తున్నాయి. ఈ ఆర్టికల్ లో రూ.200 లోపు ధరలో లభించే ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
రూ.200 లోపు ధరలో లభించే BSNL STV (స్పెషల్ ట్యారిఫ్ వోచర్) ప్లాన్స్
STV 184 ప్లాన్ ప్రయోజనాలు
- BSNL అందిస్తోన్న రూ.184 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- ఇంకా అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.
- ఇంకా డెయిలీ 1జిబి డేటా లభిస్తుంది. లిమిట్ తర్వాత 40కేబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
- ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజం కూడా ఉంది. రూ.184 ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి 28 రోజుల పాటు BSNL ట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి.
STV 185 ప్లాన్ ప్రయోజనాలు
- BSNL అందిస్తోన్న రూ.185 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 1జిబి డేటా, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా డేటా పరిధి ముగిసాక 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
- అలాగే ఈ ప్లాన్ ద్వారా అదనంగా BSNL ట్యూన్స్ కూడా 28 రోజుల పాటు లభిస్తాయి.
STV 186 ప్లాన్ ప్రయోజనాలు
- రూ.186 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డెయిలీ 1జిబి డేటా లభిస్తుంది.
- అలాగే 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. డెయిలీ డేటా లిమిట్ దాటాక, 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
- ఈ ప్లాన్ ద్వారా హార్డీ గేమ్స్ సర్వీస్ మరియు BSNL ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
PRBT STV 187 ప్లాన్ ప్రయోజనాలు
- BSNL అందిస్తోన్న రూ.187 ప్లాన్ ద్వారా యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా లభిస్తాయి. ఇంకా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే ఉచిత పీఆర్బీటీ లభిస్తుంది.