ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హయ్యస్ట్ స్పీడ్ 200kmph, రేంజ్ 300km

హైలైట్స్

  • EICMA 2022 లో తన మ్యాక్సీ స్కూటర్ ని పరిచయం చేసిన ఎలక్ట్రిక్ బైక్ తయారీదారు Horwin
  • తన మ్యాక్సీ స్కూటర్ కి Sentimenti 0 అనే పేరు పెట్టిన Horwin
  • కేవలం 2.8 సెకన్లలో 100కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోనున్న హార్విన్ సెంటిమెంటి జీరో

అటు రేంజు, ఇటు స్పీడు.. రెండింట్లో తిరుగులేదనిపించేలా ఉంది లేటెస్ట్ మ్యాక్సీ స్కూటర్ Horwin Sentimenti 0. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన ప్రతీది వారెవా అనిపించేలా ఉంది. డిజైన్, స్పెసిఫికేషన్స్, పవర్‌ట్రెయిన్ ఇలా అన్ని విభాగాల్లో Horwin Sentimenti 0 మిన్నగా నిలుస్తోంది. ఎలక్ట్రిక్ బైక్స్ తయారు చేసే Horwin కంపెనీ తాజాగా EICMA 2022 ఈవెంట్ లో తన మ్యాక్సీ స్కూటర్ Horwin Sentimenti 0 ని అందరికీ పరిచయం చేసింది.

ఆస్ట్రియాకు చెందిన Horwin సంస్థ 2019 లో తన తొలి మోటర్ సైకిల్ ని లాంచ్ చేసింది. దాని పేరు CR6 Pro. అయితే భారత మార్కెట్ లో Horwin తన వాహనాలను లాంచ్ చేయబోదని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Horwin Sentimenti 0 ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్

Horwin Sentimenti 0 ఎలక్ట్రిక్ స్కూటర్ 400V ఆర్కిటెక్చర్ పై తయారైంది. 0 నుంచి 80 శాతం చార్జ్ అవ్వడానికి ఈ స్కూటర్ బ్యాటరీ కేవలం 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. అలాగే 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని చేరుకోవడానికి కేవలం 2.8 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఇంకా ఈ బండి టాప్ స్పీడ్ 200 కేఎంపీహెచ్. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గనుక ఈ బండి 300 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదని కంపెనీ చెబుతోంది.

బ్యాటరీ శక్తి తగ్గుతున్నా, ఆ ప్రభావం Sentimenti 0 బండిపై పడదని కంపెనీ చెబుతోంది. రేంజ్ ఎక్స్‌టెండర్ ఫంక్షన్ అందుబాటులో ఉండటం వల్లన రైడర్ ఎక్కువ దూరం ప్రయాణించగలడని హార్విన్ అంటోంది. అయితే ఈ ఎక్స్‌టెండర్ ఫంక్షన్ ద్వారా డిస్టన్స్ ని ఎంతమేర పెంచుకోవచ్చన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఈ బండిలో ఇచ్చన బ్యాటరీ ప్యాక్ ని పవర్ సోర్స్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే క్యాంపింగ్ ఎక్విప్మెంట్ మరియు ఇతర ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగపడుతుందని హార్విన్ తెలిపింది.

రైడర్ స్టైల్ కి అనుగుణంగా Horwin Sentimenti 0 నడుచుకోగలదు. దీని వల్లన లాంగ్ రన్ లో ఎఫిషియెన్సీ మెరుగవుతుంది. ఈ స్కూటర్ లో ఉన్న 30 సెన్సర్స్ మరియు కెమెరాలు ఎప్పటికప్పుడు రియల్-టైమ్ సమాచారాన్ని సేకరించి తద్వారా భద్రతను మెరుగుపరుస్తుంది. సేఫ్టీ కోసం ఈ బండిలో ఏబీఎస్, యాంటి-స్లిప్ సిస్టమ్ అందించారు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, కొలిజన్ అలర్ట్ వంటివి ఉన్నాయి.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, హిల్ క్లైంబ్ అసిస్ట్, స్టార్ట్ అండ్ రివర్స్ అసిస్టన్స్, కీలెస్ గో (తాళం లేకుండా వెళ్ళడం) మరియు హీటెడ్ గ్రిప్స్ వంటివి Horwin Sentimenti 0 లో ఉన్నాయి. Horwin Sentimenti 0 లో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, టీఎఫ్‌టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ ఈ బండ్లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleOTT లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ నటించిన Ori Devuda
Next article90Hz అమోలెడ్ డిస్ప్లే, 44MP OIS సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయిన Vivo V21s
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.