90Hz అమోలెడ్ డిస్ప్లే, 44MP OIS సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయిన Vivo V21s

హైలైట్స్

  • తైవాన్ లో లాంచ్ అయిన Vivo V21s 5G స్మార్ట్ ఫోన్
  • 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్, 44ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • Vivo V21s 5G ధర NT$ 11,490 (సుమారు రూ.30,000)

V21 సిరీస్ లో వివో కంపెనీ Vivo V21s 5G అనే కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. ఈ ఫోన్ తాజాగా తైవాన్ లో లాంచ్ అయ్యింది. 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 44ఎంపి ఫ్రంట్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుండటం విశేషం. అలాగే డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. Vivo V21s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

Vivo V21s 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Vivo V21s 5G 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తోంది. ఈ డిస్ప్లే ప్యానెల్ 60,00,000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

Vivo V21s 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Vivo V21s 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో ఓఐఎస్ తో కూడిన 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్ననాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 44ఎంపి ఓఐఎస్ కెమెరాను అందించారు. ముందు వైపు కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అందించడం విశేషం.

Vivo V21s 5G లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 63 శాతం చార్జింగ్ అయ్యేందుకు 30 నిమిషాల సమయం పడుతుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్ సీ పోర్ట్ అందించారు. అయితే ఇందులో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇవ్వలేదు. డ్యూయల్ సిమ్, 5జీ, వైఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo V21s 5G స్మార్ట్ ఫోన్ ధర, కలర్ ఆప్షన్స్, లభ్యత

Vivo V21s 5G స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: డార్క్ బ్లూ, కలర్ఫుల్. ఏజీ మ్యాట్ గ్లాస్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 159.68 మిల్లీ మీటర్ల పొడవు, 73.90 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.39 మిల్లీ మీటర్ల మందం, 177 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V21s 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర NT$ 11,490 (సుమారు రూ.30,000) గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ తైవాన్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. గ్లోబల్ గా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హయ్యస్ట్ స్పీడ్ 200kmph, రేంజ్ 300km
Next articleiPhones తయారు చేయనున్న గిరిజన మహిళలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.